సమంతతో నాగశౌర్య ‘చెత్త’ రొమాన్స్... డైరెక్టర్ నందినీరెడ్డి క్రేజీ కామెంట్స్

అందం, అభినయంతో మెప్పిస్తున్న సమంత అక్కినేని తాజా చిత్రం ఓ బేబీ. కొరియా భాషలో రూపొందిన మిస్ గ్రానీ అనే సినిమా ఆధారంగా తెరకెక్కుతున్నది. ఈ సినిమా జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలు మీడియా సంస్థలతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా రొమాంటిక్ వీడియో సాంగ్‌ను విడుదల చేయగా అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. ఈ వీడియోకు కేవలం 24 గంటల్లోనే 2 లక్షల వ్యూస్ సాధించింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సమంత మాట్లాడుతూ.. హీరో నాగశౌర్యకు చాలా సిగ్గు. ఆయనతో రొమాన్స్ చేయడం తలకు మించిన భారంగా మారిందన్నారు.

అయితే సమంత వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ నాగశౌర్య సిగ్గు గురించి దర్శకురాలు నందినీ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. శౌర్య గురించి సమంత చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమే. నాగశౌర్య తీరు చూసి నేను టెన్షన్‌గా ఫీలయ్యాను. ఆయనను చూసి ఓరి దేవుడో అని అనుకొన్నాను. అతనికి అంత సిగ్గుందని నాకు అసలే తెలియదు. హీరోయిన్‌ ఓ చోట ఉంటే.. దాదాపు 20 అడుగుల దూరంలో నాగశౌర్య ఉండేవాడు అని నందినీరెడ్డి చెప్పింది.

 Samantha Akkineni: Naga Shaurya worst in Romantic scenes

ఓ బేబీ సినిమా పాటల షూటింగ్ సందర్భంగా నాగశౌర్యను రొమాంటిక్ మూడ్‌లోకి తెప్పించడానికి సమంత చాలా కష్టపడింది. ఆయనకు కుక్కలంటే చాలా ఇష్టమని తెలిసి ఆమె వాటికి గురించి మాట్లాడి చొరవ తీసుకొన్నారు. తమ ఇంట్లే ఉండే పెంపుడు కుక్క హాష్ అక్కినేని గురించి చెప్పి నాగశౌర్యను ఓ మూడ్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. దాంతో మెల్లగా రొమాంటిక్ మూడ్‌లోకి నాగశౌర్య వచ్చే వాడు. వెంటనే మా షాట్ తీసుకొనే వాళ్లం అని నందినీ రెడ్డి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X