సమంత న్యూ స్టెప్.. మంచు వారమ్మాయి బాటలో అక్కినేని కోడలు
అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్‌ని ఆసక్తికరంగా మలుస్తోంది. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ సరికొత్త అడుగులేస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి వెండితెర క్వీన్ అనిపించుకున్న ఈ బ్యూటీ.. ఇకపై ప్రతీ ఇంటా బుల్లితెర ఆడియన్స్‌ని కూడా మెప్పించనుందట. తన సందడి రెట్టింపు చేస్తూ న్యూ స్టెప్ వేయాలని డిసైడ్ అయిందట సామ్. ఇంతకీ ఏంటా స్టెప్? వివరాల్లోకి పోతే..

ఏ మాయ చేశావే.. సమంత కమిట్మెంట్స్
'ఏమాయ చేశావే' అంటూ పరిచయమైన సమంత.. ఆ తర్వాత కెరీర్ లో ఎక్కడా వెనుదిరిగి చూసింది లేదు. ఎప్పటికప్పుడు నయా ట్రెండ్ ఫాలో అవుతూ వరుస కమిట్మెంట్స్ అందుకుంది సమంత. ఈ మేరకు పాత్ర ఏదైనా తన మార్క్ చూపిస్తూ క్లాస్, మాస్ ఆడియన్స్‌ని వలలో వేసుకుంది సామ్.

చిన్న, పెద్ద అందరు హీరోలతో రొమాన్స్.. చైతుతో పెళ్లి
స్టార్ హీరోలందరి తోనూ నటించిన ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న సామ్.. ఆ తర్వాత చిన్న హీరోలతో కూడా రొమాన్స్ చేసింది. ఇక నాగ చైతన్యను పెళ్లాడాక తన సినిమాల జోష్ మరింత పెంచేసింది. పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది సమంత. నిజానికి పెళ్లి తర్వాతనే ఆమెకు బాగా కలిసొచ్చిందని చెప్పాలి.

భర్తతో మజిలీ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై నెగెటివ్ రోల్
పెళ్లి తర్వాత తన భర్త నాగచైతన్యతో తెర పంచుకున్న సమంత 'మజిలీ' రూపంలో మరపురాని హిట్ అందుకుంది. ఆ తర్వాత ఓ బేబీ, జాను లాంటి సినిమాలతో అలరించడమే గాక ఇటీవలే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా అడుగుపెట్టింది. ది ఫ్యామిలీ మాన్ 2లో నెగిటివ్ ఛాయలున్న పాత్రలో నటిస్తోంది సమంత.

మంచు లక్ష్మి బాటలో సమంత
ఇదిలా ఉంటే ఇప్పుడు మంచువారమ్మాయి లక్ష్మి బాటలో ఓ ప్రోగ్రాం హోస్ట్ చేసేందుకు రెడీ అయిందట సమంత. ఈ మేరకు ఓ రియాలిటిక్ టీవీ షో ప్లాన్స్ నడుస్తున్నాయట. ఇది కూడా ఓ టాక్ షో అని తెలుస్తోంది. అందులో హోస్టుగా సమంత కనిపించనుందట. ఈ షో కోసం ఆమెకు భారీగా పారితోషికం కూడా ఆఫర్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
Recommended Video


సమంత స్పీడ్.. స్నేహ భర్తతో సిద్ధం
మరోవైపు సమంత తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కనున్నఓ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యిందని సమాచారం. దర్శకుడు అశ్విన్ శరవణన్ తెరెకెక్కించనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది గాక మరో తమిళ ప్రాజెక్ట్‌ని ఒప్పుకున్న సామ్, అందులో స్నేహ భర్త నటుడు ప్రసన్న సరసన నటించనుందట. ఏదేమైనా సమంత స్పీడ్ మాత్రం మామూలుగా లేదనే చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications











