సినీ కెరీర్‌పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. రిటైర్‌మెంట్‌కి రెడీ అవుతోందా?
అక్కినేని కోడలు సమంత సూపర్ ఫామ్‌లో ఉంది. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ టాలీవుడ్ తెరపై సత్తా చాటుతోంది. ఈ మధ్యకాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సమంత.. ఇటీవలే 'ఓ బేబీ' రూపంలో ఆకట్టుకొని ఇప్పుడు 'జాను'గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రోజే (ఫిబ్రవరి 7) జాను ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది సమంత. ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ జర్నీ, రిటైర్‌మెంట్ తదితర అమాశాలపై ఆసక్తికరంగా స్పందించింది. ఇంకా రెండు మూడేళ్ల పాటే తాను సినిమాల్లో నటిస్తానని, ఆ తర్వాత రెస్ట్ వెండితెరకు దూరంగా ఉంటానంటోంది సమంత.

''పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటిస్తున్నాను. అయితే, నాకూ కుటుంబం ఉంది కదా.. ఆ కుటుంబ బాధ్యతలు వుంటాయి కదా, అందుకే మహా అయితే మరో రెండు మూడేళ్ల పాటు నటిస్తానేమో'' అని చెప్పింది సమంత. అందుకే చేయబోయే సినిమాలన్నీ ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలే చేస్తానని ఆమె పేర్కొంది.
దీంతో సమంత త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పనుందా? అనే ప్రశ్నకు సమాధానం దొరికినట్లయింది. మొత్తానికైతే సమంత రిటైర్‌మెంట్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చూడాలి మరి ఈ రెండేళ్లలో సమంత ఎలాంటి సినిమాలతో అలరిస్తుందో!.


Click it and Unblock the Notifications











