వెగన్ ఫిల్టర్ కాఫీతో అదరగొట్టిన సమంత.. ఉపాసన కోసం స్పెషల్‌గా
ఆరోగ్యం, మానసిక పరిపుష్టి కోసం మెగా కోడలు ఉపాసన కొణిదెల ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందరికీ తెలిసిందే. ఆరోగ్య చిట్కాలు అందించేందుకు Ur Life అనే మ్యాగజైన్‌ను నడుపుతున్నారు. ఈ మ్యాగజైన్‌కు గెస్ట్ ఎడిటర్‌గా సమంత అక్కినేని వ్యవహరిస్తున్నారు. హెల్త్, ఫిట్‌నెస్ కోసం పరితపించే సమంత ఎడిటర్‌గా తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ మ్యాగజైన్, యూట్యూబ్ ఛానెల్ కోసం ప్రత్యేమైన రెసిపీని సమంత చేయడం విశేషంగా మారింది. ఈ మ్యాగజైన్ కోసం స్పైస్ అప్ యవర్ లైఫ్ విత్ సామ్ అనే శీర్షికన మంచి కాఫీని తయారు చేసి చూపించారు.
తాజాగా వెగన్ ఫిల్టర్ కాఫీ అండ్ చాకోలేట్ చియా సీడ్ మౌస్సే అనే రెసిపీని పాఠకులకు, ఔత్సాహికులకు పరిచయం చేశారు. ఈ కాఫీలో ఆర్యోగాన్ని రక్షించే అంశాలతోపాటు, పోషక విలువలు కూడా ఉంటాయని, అలాగే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు అని సమంత తెలిపారు. ప్రస్తుతం ఈ రెసిపీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ఇక ఆరోగ్యం గురించి ఎప్పుడు ఆలోచించే ఉపాసన, సమంతకు కాఫీ లవర్స్‌గా పేరుంది. తాజాగా వెగన్ ఫిల్టర్ కాఫీని పరిచయం చేశారు. చీయా సీడ్ పుడింగ్‌ను మేలవించారు. చియా సీడ్స్‌లో ఒమేగా 3 అనే గొప్ప పోషక విలువలు ఉంటాయి. ఈ కాఫీ ద్వారా బ్లడ్ షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. ఎనర్జీ, ఉత్సాహాన్ని ఈ కాఫీ అందిస్తుందని చెప్పారు. ఈ కాఫీని కేవలం 20 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చని సమంత చెప్పారు.


Click it and Unblock the Notifications











