సరిగ్గా ఆ సమయంలో ఆఫర్ చేశారు.. నిజంగా అదో సవాల్: సమంత కామెంట్స్

అక్కినేని కోడలు సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ టాలీవుడ్ తెరపై సత్తా చాటుతోంది. ఈ మధ్యకాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సమంత.. ఇటీవలే 'జాను'గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఇప్పుడు నయనతారతో కలిసి మరో తమిళ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పింది సమంత. వివరాల్లోకి పోతే..

నిరాశ చెందిన సమంత.. అయినప్పటికీ!

నిరాశ చెందిన సమంత.. అయినప్పటికీ!

మజిలీ, ఓబేబి సినిమాలతో విజయాలను అందుకున్న ఈ అక్కినేని కోడలు ఇటీవలే జానుతో ప్రేక్షకుల ముందుకొచ్చి కాస్త నిరాశ చెందింది. అయినప్పటికీ సినిమాల జోష్ తగ్గించేదే లేదంటూ విభిన్న కథాంశాలను ఎంచుకుంటోంది. ఇందులో భాగంగా తమిళ చిత్రం 'కాత్తువక్కుల రెందు కాదల్' కి ఓకే చెప్పింది అక్కినేని సమంత.

సమంతను సంప్రదించగా ఆమె..

సమంతను సంప్రదించగా ఆమె..

విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'కాత్తువక్కుల రెందు కాదల్' చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా, నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. మరో హీరోయిన్ కోసం సమంతను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఇందులో నటించేందుకు గల కారణాలు వెల్లడించింది సమంత.

అలా ఆఫర్.. అదో సవాల్

అలా ఆఫర్.. అదో సవాల్

ఆసక్తికరమైన, విభిన్నమైన కథల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో 'కాత్తువక్కుల రెండు కాదల్‌' సినిమా ఆఫర్‌ తన దగ్గరికి వచ్చిందని సమంత తెలిపింది. విజయ్ సేతుపతి, నయన్ లాంటి స్టార్స్‌తో నటించడం ఓ సవాల్‌గా అనిపిస్తోందని, నయన్ పక్కన బెస్ట్‌గా నటించాడని చాలా పోటీ పడతానని చెప్పింది సమంత. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

సినిమాలే కాదు.. అవి కూడా

సినిమాలే కాదు.. అవి కూడా

ఇకపోతే కేవలం సినిమాలే గాక డిజిటల్ రంగంలోనూ సత్తా చాటేందుకు రెడీ అయిన సమంత వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తోంది. సినిమాలు చేస్తూనే డిజిటల్ రంగంలో హవా కొనసాగిస్తానని ఆమె చెబుతోంది. ఇదిలా ఉండగానే ఇటీవలే ఎడ్యుకేషన్ బిజినెస్ లోకి కూడా ప్రవేశించింది సమంత.

Recommended Video

Jaanu Movie Review | Sharwanand | Samantha | 96 Movie | Jaanu | Filmibeat Telugu
లెర్నింగ్ సెంటర్‌.. ఆ ఇద్దరితో కలిసి

లెర్నింగ్ సెంటర్‌.. ఆ ఇద్దరితో కలిసి

ఇప్పటికే ప్ర‌త్యూష అనే స్వ‌చ్చంద సంస్థ ద్వారా ఎంతోమంది చిన్నారుల‌కు అండ‌గా నిలుస్తున్న స‌మంత.. జూబ్లీ హిల్స్ లో శిల్పా రెడ్డితో పాటు ప్ర‌ముఖ విద్యావేత్త ముక్తా ఖురానాతో క‌లిసి 'ఏకం' లెర్నింగ్ సెంటర్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X