For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చైతన్యతో విడాకులు.. అలా స్పందించిన సమంతా.. ఆ ఫోటోలు షేర్ చేసి మరీ!

  |

  సెలబ్రిటీల పర్సనల్ విషయాలు అంటే సామాన్య ప్రజానీకానికి చాలా ఆసక్తి ఎక్కువ. సెలబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతోంది ? వారి పర్సనల్ లైఫ్ లో ప్రస్తుతం జరుగుతున్న విశేషాలు ఏమిటి ? అనే విషయాల మీద ఎక్కువగా ఫొకస్ పెడుతూ ఉంటారు. ప్రజలు ఈ విషయాల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు కాబట్టి మీడియా కూడా సెలబ్రిటీల పర్సనల్ విషయాలను ఎత్తి చూపించే విధంగా అనేక సందర్భాలలో కథనాలు ప్రచురిస్తూ ఉంటాయి..

  కొద్ది రోజుల క్రితం నుంచి సమంత నాగ చైతన్య ల వివాదం ఒకటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారనేది ఆ ప్రచారం సారాంశం. తాజాగా ఈ విషయం మీద సమంత పరోక్షంగా స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే

  చైతూ పెళ్లి

  చైతూ పెళ్లి

  చెన్నై భామ సమంత ఏం మాయ చేసావే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. చేసిన మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు వేయించుకున్న సమంత ఆ తర్వాత వరుసగా సినిమాలు హిట్ టాప్ హీరోల సరసన నటిస్తూ ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా అనుభవిస్తోంది. కొన్నాళ్ళ క్రితం వరకు ఆమెకు చేతి నిండా సినిమాలు ఉండేవి కానీ అనూహ్యంగా ఏం మాయ చేసావే సినిమాలో తనతో పాటు నటించిన మొట్ట మొదటి హీరోయిన్ నాగచైతన్య తో ప్రేమలో పడి ఆమె ఆయననే వివాహం చేసుకుంది. అయితే వీళ్లిద్దరి వివాహం గురించి అప్పట్లో చాలా చర్చలు జరిగాయి. నేషనల్ స్థాయిలో కూడా వీరి వివాహం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

  ఎక్కడా లైన్ తప్పకుండా

  ఎక్కడా లైన్ తప్పకుండా

  పెళ్లి తర్వాత కూడా సమంత బోల్డ్ తరహా పాత్రలు ఎంచుకోకుండా ఎక్కడా అందాల ఆరబోతకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయకుండా ఫ్యామిలీ పాత్రలు చేస్తూ వస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు విభిన్నమైన సినిమాలు మాత్రమే ఒప్పుకుంటూ ఆమె సినిమాలు చేస్తోంది. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ గత కొద్ది రోజుల నుంచి సమంత - నాగచైతన్య విడిపోతున్నారు అంటూ ప్రచారం మొదలైంది. దానికి కారణం సమంత తన సోషల్ మీడియా వేదికగా పేరు మార్చడమే. అంతకు ముందు సినిమాల పేర్లు పెడుతూ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తూ వచ్చిన సమంత చివరిగా అక్కినేని సమంత అనే పేరు ఫైనల్ గా పెట్టింది.

  అదే అసలు టెన్షన్

  అదే అసలు టెన్షన్


  అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొన్ని నెలల క్రితం అక్కినేని సమంత అనే పేరు ని పూర్తిగా తొలగించి ఎస్ అనే అక్షరంతో పేరుని ఉంచింది. ఒకరకంగా ఈ వ్యవహారంతోనే ఈ విడాకుల వార్తలు మొదలయ్యాయి అని చెప్పవచ్చు. ఈ వార్తలు మొదలైన తరువాత కూడా సమంత కొన్ని ఇంటర్వ్యూలలో ఈ వ్యవహారం మీద స్పందించింది. అంటే ఇది చాలా చిన్న విషయమని చెబుతూనే ఇలాంటి వాటికి ఏమని స్పందించినా సరే అది కాంట్రవర్సీ అవుతోంది, కాబట్టి ప్రస్తుతానికి తాను ఏమీ స్పందించని అదే తన స్పందన అని ఆమె చెప్పుకొచ్చింది. ఇంకేముంది నాగచైతన్య నుంచి సమంతకు దూరం పెరిగి పోయింది కాబట్టి వాళ్లు ఇద్దరూ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం మొదలైంది. లేదని ఇద్దరినీ వేరువేరుగా ఉంటున్నారని ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ వచ్చాయి.

  విడిపోవడం లేదని

  విడిపోవడం లేదని

  అయితే నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా సమంత ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ నాగార్జున మామ అని సంబోధించడం తో హమ్మయ్య వీళ్లిద్దరు విడిపోవడం లేదు అంటూ అభిమానులు అయితే రిలాక్స్ అయ్యారు. అయినా సరే మీడియా ముందుకు లేదా సోషల్ మీడియా వేదికగా కూడా సమంత కానీ నాగచైతన్య గాని ఈ అంశం గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇలాంటి పుకార్లకు స్పందించడం ఎందుకు అనుకున్నారో లేక దీని వెనుక నిజం ఉందో తెలియదు కానీ నాగార్జున కాంపౌండ్ నుంచి కానీ సమంత నుంచి కాని దీనికి సంబంధించి ఎలాంటి స్పందన రాకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా సమంత షేర్ చేసిన ఒక పోస్టు మాత్రం పరోక్షంగా ఈ విడాకుల వార్తలను కొట్టి పారేస్తున్నట్టుగా ఉంది.

  కుక్కల ఫోటోలు షేర్ చేసి

  కుక్కల ఫోటోలు షేర్ చేసి

  విషయం ఏమిటంటే సమంత తన సోషల్ మీడియా వేదికగా రెండు ఫోటోల కాలేజ్ ను షేర్ చేసింది. అవి రెండూ కుక్క పిల్లలకు సంబంధించిన ఫోటోలు కాగా మొదటి దానిలో ఒక కుక్క గాండ్రిస్తూ పళ్ళన్నీ బయటపెట్టి ఉన్నట్లు ఉంది దాన్ని మీడియాగా సంబోధించిన సమంత కింద మరో రెండు కుక్కపిల్లలు ప్రశాంతంగా ఉన్న ఫోటోలు పెట్టింది. అంటే ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని కూడా ఇలా గందరగోళంగా ఏదో జరిగిపోతోంది అన్నట్లుగా చూపించడంలో మీడియా ముందు ఉంటుంది అనే సంకేతాలు ఆమె ఈ ఫోటోల ద్వారా ఇచ్చినట్లయింది. తద్వారా ఎలాంటి విడాకులకు సంబంధించిన వ్యవహారం నడవడం లేదు అనే విషయాన్ని ఆమె క్లారిటీగా చెప్పినట్లయింది. ఇప్పటికైనా ఈ విడాకుల వార్తలు ఆగుతాయో లేదో అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి మరి. ప్రస్తుతం సమంత తెలుగులో ఒక సినిమా, తమిళంలో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాల తర్వాత గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆమె ప్రకటించింది.

  English summary
  Samantha Akkineni Responds indirectly on divorce with naga chaitanya by sharing a post in instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X