అనుకున్న దానికంటే ముందే సమంత.. 'జాను' ఇలా ఫిక్సయింది
'ఓ బేబీ' సినిమా తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించలేదు అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత. వరుస సక్సెస్‌ల తర్వాత కొంత గ్యాప్ రావడంతో ఆమె సినిమా కోసం టాలీవుడ్ లోకం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో తన తాజా సినిమా 'జాను' ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిన సామ్.. అనుకున్న తేదీ కంటే ముందే రానుండటం ఆసక్తి కలిగిస్తోంది.
వైవిధ్యభరితమైన కథా చిత్రంగా తమిళంలో విడుదలైన సక్సెస్ సాధించిన '96' సినిమాను తెలుగులో 'జాను' పేరుతో రూపొందించారు. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం గట్టిగా పోటీ మరీ ఆ హక్కులను దక్కించుకున్న దిల్ రాజు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జాను' చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన సమంత నటిస్తోంది. ఇందులో జానుగా సమంతదే లీడ్ రోల్. ముందుగా ఈ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ తేదీ మార్చేస్తూ ఓ వారం ముందుగానే (ఫిబ్రవరి 7న) విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్.
ఇప్పటికే విడుదలైన జాను పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ భారీ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. కథాపరంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించి సూపర్ హిట్ సాధిస్తుందని అంటున్నారు ఈ చిత్ర దర్శకనిర్మాతలు.


Click it and Unblock the Notifications











