'ఓ బేబీ'కి సెన్సార్ సర్టిఫికెట్.. సమంత ఖుషీ ఖుషీ
నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిందిన 'ఓ బేబీ' సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు సభ్యులు క్లీన్ U సర్టిఫికెట్ జారీ చేశారు. ఓ బేబీ రన్ టైమ్ 2 గంటల 40 నిమిషాలు అని పేర్కొన్నారు. ఈ మేరకు విషయాన్ని తెలుపుతూ సెన్సార్ రిపోర్ట్‌తో కూడిన పిక్ షేర్ చేసింది చిత్రయూనిట్. ఈ పిక్ లో సమంత ఫుల్ ఖుషీ ఖుషీగా కనిపిస్తోంది.
గతంలో తనకు సంబందించిన ఏ సినిమాకు చూపనంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఈ సినిమాపై చూపుతోంది సమంత. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటోంది. ఇక ఓ బేబీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడం దానికి తోడు సినిమాకు క్లీన్ U సర్టిఫికెట్ రావడం చూస్తుంటే ఓ బేబీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేయడం ఖాయం అని తెలుస్తోంది. పెళ్లి తర్వాత వరుస హిట్స్ రాబడుతున్న సమంత ఈ సినిమా ద్వారా మరో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోనుందని అర్థమవుతోంది.

'మిస్ గ్రానీ' అనే కొరియన్ మూవీకి తెలుగు రీమేక్‌గా 'ఓ బేబీ' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో సమంత, నాగశౌర్య లీడ్ రోల్స్ పోషించగా.. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి శ్రీలక్ష్మి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. 70 ఏళ్ల ముసలావిడ హావభావాలు పండించే 23 ఏళ్ల పడుచు పిల్లగా సామ్ రోల్ చిత్రానికే పెద్ద ఎసెట్. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జులై 5 వ తేదీన భారీ అంచనాల నడుమ ఓ బేబీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











