నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదంటూ పిచ్చెక్కించిన సమంత.. వీడియో చూడండి

నాగచైతన్యతో పెళ్లి తర్వాత మంచి జోష్ లో ఉంది సమంత. పెళ్లి కాగానే వెంటనే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ సరసన పల్లెటూరు పిల్లగా నటించిన ఈ భామ ఆ తర్వాత వరుసపెట్టి డిఫెరెంట్ డిఫెరెంట్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. మహానటిలో జర్నలిస్టుగా, ఆ వెంటనే భర్త నాగచైతన్యతో మజిలీ సినిమాలో గృహిణిగా సమంత బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో పెళ్ళికి ముందు కంటే కూడా పెళ్లి తర్వాతే సమంతకు సినీ గ్లామర్ పెరిగిందనే టాక్ వచ్చింది. కాగా తాజాగా ఓ బేబీ చిత్రంతో థియేటర్లలో సందడి చేసేందుకు సమంత రెడీ అయింది. ఆ విశేషాలు చూద్దామా..

 ప్రయోగాత్మక చిత్రం ఓ బేబీ

ప్రయోగాత్మక చిత్రం ఓ బేబీ

ఇటీవలే రిలీజైన మజిలీ చిత్రంలో గృహిణిగా అదరగొట్టిన సమంత ప్రస్తుతం ఓ బేబీ అనే ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. సౌత్ కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా తెలుగులో ఈ సినిమా విడుదల కానుంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సమంత మునుపెన్నడూ చేయని డిఫెరెంట్ రోల్ లో సామ్ నటిస్తోంది.

70 ఏళ్ల వృద్ధురాలు 20 ఏళ్ల యువతిగా

70 ఏళ్ల వృద్ధురాలు 20 ఏళ్ల యువతిగా

70 ఏళ్ల వయసున్న వృద్ధురాలి ఆత్మ.. 20 ఏళ్ల వయసున్న యువతి శరీరంలో ప్రవేశించడం ఈ చిత్రంలో డిఫెరెంట్ పాయింట్. చిత్రంలో వృద్దురాలిగా నటి లక్ష్మీ కనిపిస్తే.. యువతిగా సమంత కనిపించనుంది. అంటే ఈ సినిమాలో లక్ష్మి ఆత్మ సమంత శరీరంలోకి వెళ్లి చేసే కామెడీ ప్రేక్షక లోకాన్ని ఫుల్లుగా గిలిగింతలు పెట్టనుందన్న మాట.

అదే ఊపులో ఓ బేబీ టీజర్

ఓ బేబీ చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. అదేవిధంగా చిత్రానికి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఇటీవలే సమంత లుక్ విడుదల చేయగా విశేష స్పందన తెచ్చుకుంది. అదే ఊపులో తాజాగా ఓ బేబీ టీజర్ విడుదల చేశారు.

నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు

నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు

ఈ టీజర్ లో ''మాంచి వయసులో ఉన్నప్పుడే మా ఆయన పోయాడు. నాని గాడిని పెంచి పెద్ద చేయడమే సరిపోయింది'' అని నాగశౌర్యతో సమంత చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది. అలాగే ''నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి.. చూస్తారుగా'' అంటూ సమంత ఇచ్చిన ఫైనల్ టచ్ సూపర్బ్ అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ టీజర్ ద్వారా ఇప్పటికే ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి.

అందుకే సురేశ్ బాబు

అందుకే సురేశ్ బాబు

నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ బేబీ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ వారు సంయుక్తంగా సమర్పిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్‌ను ఏర్పాటు చేసి 55 ఏళ్లయిన సందర్భంగా నిర్మిస్తోన్న చిత్రం కావడంతో.. నిర్మాత సురేశ్ బాబు ఈ సినిమాను చాలా శ్రద్ద తీసుకున్నారని సమాచారం. చిత్రంలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. లక్ష్మీ, నాగ శౌర్య, రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు. జులై నెలలో ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X