ఎంజాయే చేయాలి.. లైఫ్ తనకు నచ్చినట్టుగా.. సమంత వేషాలు చూడండి

అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి సమంతకు బాగా కలిసొచ్చింది. స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటోంది ఇక సినిమాలు చేయదేమో! సామ్ గ్లామర్ వెండితెర లోటుగా మిగులుతుందేమో అనుకున్నారంతా. కానీ పెళ్లి తర్వాత సమంత తన గ్లామర్ డోస్ డబుల్ చేసేసింది. లైన్ కడుతున్న సినిమాలు, అందులోనూ లిప్‌లాక్స్ మొదలు కొని ఫ్యాషన్ లుక్స్, సెక్సీ ఫొటోస్, వెకేషన్ టూర్స్ అన్నీ తనవే అన్నట్లుగా యమ జోష్‌లో దూసుకుపోతోంది సామ్. తాజాగా ఆమె చేసిన ఓ డిఫెరెంట్ మూవీ 'ఓ బేబీ'. ఈ చిత్రం నుంచి ఓ సాంగ్ విడుదల కాగా అందులో సమంత చేస్తున్న ఎంజాయ్ హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం..

రీమేక్ సినిమా ఓ బేబీ

రీమేక్ సినిమా ఓ బేబీ

ఇటీవలే రిలీజైన మజిలీ చిత్రంలో గృహిణిగా అదరగొట్టిన సమంత ప్రస్తుతం ఓ బేబీ అనే ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. సౌత్ కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా తెలుగులో ఈ సినిమా విడుదల కానుంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సమంత మునుపెన్నడూ చేయని డిఫెరెంట్ రోల్‌లో నటిస్తోంది.

ఓ ముసలమ్మ యువతిగా ఎంజాయ్

ఓ ముసలమ్మ యువతిగా ఎంజాయ్

70 ఏళ్ల వయసున్న వృద్ధురాలి ఆత్మ.. 20 ఏళ్ల వయసున్న యువతి శరీరంలో ప్రవేశించడం ఈ చిత్రంలో డిఫెరెంట్ పాయింట్. చిత్రంలో వృద్దురాలిగా నటి లక్ష్మీ కనిపిస్తే యువతిగా సమంత కనిపించనుంది. అంటే ఈ సినిమాలో లక్ష్మి ఆత్మ సమంత శరీరంలోకి వెళ్లి చేసే కామెడీ ప్రేక్షక లోకాన్ని ఫుల్లుగా గిలిగింతలు పెట్టనుందన్న మాట.

ఎంజాయే చేయాలి.. లైఫు నీకు నచ్చినట్టుగా

తాజాగా ఓ బేబీ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. లక్ష్మీ భూపాల లిరిక్స్ లో వస్తున్న ఈ సాంగ్ రొటీన్‌గా కాకుండా క్యాచీగా ఉండే పదాలతో ఆకట్టుకుంటోంది. 20 ఏళ్ల అందమైన యువతి షాపింగ్‌కి వెళ్లి అక్కడ తనకు నచ్చినట్టు ప్రవర్తిస్తే పాపం సేల్స్ బోయ్స్ పరిస్థితి, ఎంజాయే చేయాలి.. లైఫు నీకు నచ్చినట్టుగా అన్నట్లుగా సామ్ ప్రవర్తిస్తున్న తీరు చూపించి సినిమాపై సరికొత్త ఆసక్తి రేపారు.

నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు

నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు

ఇక ఇటీవలే విడుదలైన ఓ బేబీ టీజర్‌లో ''మాంచి వయసులో ఉన్నప్పుడే మా ఆయన పోయాడు. నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి.. చూస్తారుగా'' అంటూ సమంత చెప్పిన కొన్ని డైలాగ్స్ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అనే కుతూహలాన్ని పెంచేశాయి. ఈ చిత్రంలో సమంత క్యారెక్టర్ చూస్తుంటే.. దీనికి సామ్ తప్ప ఇంకెవ్వరూ సూట్ కాలేరని అనిపిస్తోంది.

యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి..

యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి..

నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంతకు జోడీగా యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్నాడు. రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె.మేయ‌ర్ బాణీలు కడుతున్నారు. భారీ అంచనాల నడుమ జులై నెలలో 'ఓ బేబీ' ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X