అమ్మో! ఈ యంగ్ హీరోతో రొమాన్స్ చేయాలంటే కష్టమే.. సమంత సెన్సేషనల్ ట్వీట్
Recommended Video
క్రేజీ హీరోయిన్ సమంత ఓ హీరోతో రొమాన్స్ చేయడం చాలా కష్టమని చెబుతూ తాజాగా ఓ సెన్సేషనల్ ట్వీట్ పెట్టింది. పైగా ఆ విషయం తనకు, డైరెక్టర్ నందిని రెడ్డికి తప్ప ఎవ్వరికీ తెలియదని పేర్కొంటూ షాకింగ్ ట్యాగ్ చేసింది సామ్. పెళ్లి తర్వాత కూడా రొమాన్స్ గురించి సమంత ఇంత ఓపెన్‌గా మాట్లాడటం టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమె చెప్పింది ఏ హీరో గురించి? అతనితో రొమాన్స్ విషయమై ఆమెకొచ్చిన ఇబ్బంది ఏమిటి? అసలు సమంత ట్వీట్‌లో ఏమని పేర్కొంది? వివరాల్లోకి పోతే..

గృహిణిగా అదరగొట్టి.. ఇప్పుడు ప్రయోగాత్మకంగా
ఇటీవలే రిలీజైన మజిలీ చిత్రంలో గృహిణిగా అదరగొట్టిన సమంత ప్రస్తుతం 'ఓ బేబీ' అనే ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో యంగ్ హీరో నాగశౌర్య- సమంత జోడీగా నటిస్తున్నారు. సౌత్ కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా తెలుగులో ఈ సినిమా విడుదల కానుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మునుపెన్నడూ చేయని డిఫెరెంట్ రోల్‌లో సమంత నటిస్తోంది.

నాగశౌర్యతో రొమాన్స్
సినిమా అన్నాక రొమాంటిక్ సన్నివేశాలు ఉండటం సాధారణమే. పైగా పెళ్లి తర్వాత రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి సమంత అస్సలు వెనుకాడటం లేదు. ఈ మేరకు తన తాజా సినిమా ఓ బేబీలో యంగ్ హీరో నాగశౌర్యతో రొమాన్స్ చేయడం ఆమెకు చాలా కష్టంగా అనిపించిందట. ఈ విషయాన్ని సమంతనే స్వయంగా వెల్లడించి షాకివ్వడం విశేషం.
నాలో మైమరపు..
ఓ బేబీ సినిమాలోని రెండో పాట 'నాలో మైమరపు..' ఈ రోజు (జూన్ 10) సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పేర్కొన్న సామ్.. ''యంగ్ హీరో నాగశౌర్యతో రొమాన్స్ చేయడమంటే అంత ఈజీ కాదు. ఆ విషయం నదిని రెడ్డికి, నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు'' అంటూ ఆశ్చర్య పరిచే ఆసక్తికర సందేశం పోస్ట్ చేసింది. అంతేకాదు నాగశౌర్య సిగ్గుపడుతుండగా.. ఆయన వైపే నవ్వుతూ తాను చూస్తున్న పిక్ కూడా షేర్ చేసింది సామ్.

నాలోని రొమాంటిక్ కోణాన్ని బయటికి తీశావు
కాగా సమంత పెట్టిన ట్వీట్ చూసి నాగశౌర్య అంతకంటే ఆసక్తికర కామెంట్ పెట్టి.. మరింత సెన్సేషన్ క్రియేట్ చేశాడు. 'ఈ పాట కోసం నాలోని రొమాంటిక్ కోణాన్ని బయటికి తీసినందుకు నిన్ను ప్రశంసిస్తున్నా సమంత' అని నాగశౌర్య కామెంట్ పెట్టడం జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రొమాంటిక్ ముచ్చట్లన్నీ సినిమా ప్రమోషన్ కోసమే అయినా, పెళ్లి తర్వాత రొమాన్స్ విషయాల పట్ల సమంత ఇంత ఓపెన్ కావడం చూసి షాకవుతున్నారు జనం.

20 ఏళ్ల అమ్మాయి శరీరంలోకి..
నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ సినిమా తెరకెక్కుతోంది. 20 ఏళ్ల అమ్మాయి శరీరంలోకి 70 ఏళ్ల వృద్ధురాలు ప్రవేశిస్తే ఎలా ఉంటుంది అనే విలక్షణ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్రంలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. లక్ష్మీ, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. జులై నెలలో ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











