అలా ఎలా చేశావ్ సామ్.. నీకు అంత సీనుందా? వీడియోతో ఆశ్చర్యపరిచిన సమంత
హీరోయిన్ సమంత బేసికల్‌గా అన్నింటిలోను యాక్టీవే. కేవలం వెండితెర పైనే గాక బయట కూడా ఎలాంటి విషయాల్లోనైనా తనదైన చాతుర్యం ప్రదర్శిస్తూ ఉంటుంది సామ్. ఈ చాతుర్యానికే నాగచైతన్య ఫ్లాట్ అయ్యారేమో అలా ఆమెతో కెనెక్ట్ అయి పెళ్లి చేసేసుకున్నాడు. అయితే చైతుతో పెళ్లి తర్వాత సమంత ఇంకా ఆక్టివ్ అయిపోయింది. వరుస సినిమాలకు కమిట్ అవుతూ తన శరీరాకృతి, ఫిజికల్ ఫిట్‌నెస్, వ్యాయాయం పట్ల ప్రత్యేక శ్రద్ద పెడుతోంది. ఈ నేపథ్యంలో వ్యాయమశాలలో ఆమె చేసిన ఓ ఫీట్ వీడియోను నెటిజన్లతో పంచుకుంది సామ్. ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఆ వివరాలు చూస్తే..
వ్యాయామశాలలో తాను 100 కిలోల డంబెల్ పైకెత్తున వీడియో షేర్ చేసిన సమంత మీరు సక్సెస్ అయ్యేంత వరకు హార్డ్ వర్క్ చేయండంటూ సందేశమిచ్చింది. అయితే ఈ వీడియోలో సమంత గట్స్ చూసి ఆశచర్యపోవడం నెటిజన్ల వంతైంది. ఓ హీరోయిన్ ఏకంగా 100 కిలోల డంబెల్ ఎత్తడం అంటే నిజంగా మామూలు విషయం కాదు. ఈ వీడియోనే చెబుతోంది సమంత తన ఫిట్‌నెస్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో!. ఇక వీడియో చూసిన నెటిజన్లు.. అలా ఎలా చేశావ్ సామ్.. నీలో ఇంత సీన్ దాగిఉందా? యూఆర్ గ్రేట్.. ఇరాన్ లేడీవి నువ్వు, అందరికీ ఆదర్శం నువ్వు అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. పెళ్లి తర్వాత వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సామ్.. ఇటీవలే మజిలీ సినిమాతో ఆకట్టుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పెళ్లి తర్వాత మొదటిసారి సమంత, నాగచైతన్య జత కట్టారు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ భర్యా భర్తలిద్దరూ కలిసి మరో సినిమాకు కూడా కమిటైనట్లు తెలిసింది. మరోవైపు సమంత నటించిన 'ఓ బేబీ' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా విడుదలకానుంది. ఇక ప్రస్తుతం మామ నాగార్జున హీరోగా నటిస్తున్న మన్మథుడు 2లో కీలక పాత్ర పోషిస్తోంది సమంత.


Click it and Unblock the Notifications











