చిన్నప్పటి నుంచే ఆ కోరిక ఉండేది.. అందుకే నేనే వెళ్లి చెప్పేశా: సమంత
నాగచైతన్యతో పెళ్లి తర్వాత వరుస సినిమాలు చేస్తూ భారీ బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుంటోంది సమంత. హీరోయిన్ గా విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న సామ్.. మరికొద్ది రోజుల్లోనే ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ సందర్బంగా ఓ బేబీ సినిమాకు సంబందించిన విశేషాలను పంచుకుంది సమంత.

కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఒరిజినల్ వర్షన్‌ని నిర్మాత సునీత తనకు చూపించగానే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యానని చెప్పింది సమంత. చిన్నప్పటి నుంచే పూర్తిస్థాయి కామెడీ ఓరియెంటెడ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాలని కోరిక తనకు ఉండేదని, మిస్ గ్రానీ చూడగానే తాను అనుకున్న అన్ని అంశాలు ఇందులో కనిపించాయని చెప్పింది సామ్. దీంతో ఈ సినిమాకు దర్శకత్వం వహించాల్సిందిగా నందినీ రెడ్డిని తానే కోరానని, ఆమె సుముఖత చూపడంతో ఎంతో హుషారుగా ఈ సినిమా సెట్స్ పై పాల్గొన్నామని సమంత చెప్పుకొచ్చింది.
గతంలో ఏ సినిమాకు చేయని ప్రమోషన్స్ ఓ బేబీ కోసం చేస్తోంది సమంత. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పేరును కూడా బేబీ అక్కినేనిగా మార్చేసుకోవడం గమనార్హం. ఈ చిత్రంలో 70 ఏళ్ల ముసలావిడ లక్షణాలున్న 20 ఏళ్ల పడుచు పిల్లగా సమంత నటించింది. చిత్రంలో సమంత జోడీగా యంగ్ హీరో నాగశౌర్య నటించాడు. సీనియర్ నటి లక్ష్మి ముఖ్య పాత్ర పోషించింది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల నడుమ జులై 5 వ తేదీన 'ఓ బేబీ' సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











