Most desirable women 2019: టాప్ లేపిన సమంత.. పూజా హెగ్గే, శ్రీముఖికి ఎన్నో స్థానమంటే
పెళ్లి తర్వాత కూడా బ్రహ్మండంగా రాణిస్తున్న సమంత అక్కినేని మరో ఘనతను సొంతం చేసుకొన్నది. హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019లో తొలి స్థానంలో నిలిచింది. 40 లోపు మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్న పరిగణనలోకి తీసుకొని సర్వే చేయగా సమంతకు ఎక్కువ మంది ఓటు వేశారు. ఇటీవల కాలంలో ఓ బేబీ, మజిలీ లాంటి చిత్రాల విజయాలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న సంగతి తెలిసిందే.
మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా ఎంపిక కావడంపై సమంత ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇంత ఆలస్యమెందుకైందని అంటూనే గొప్పగా ఫీలవుతున్నాను అని తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక వివాహితగా ఈ టైటిల్ గెలుచుకోవడం ఎందరికో స్పూర్తిని ఇస్తుంది. నా యాటిట్యూడ్‌లో మార్పు వస్తుంది అని అన్నారు. వివాహం కెరీర్‌కు అడ్డంకి కాదనే విషయం మరోసారి రుజువైందని అన్నారు.

హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019లో నిలిచిన వారిలో
2. సంజనా విజ్
3. పీవీ సింధూ
4. అదితి రావు హైదరీ
5. పూజా హెగ్డే
6. రాజా కుమారి
7. రకుల్ ప్రీత్ సింగ్
8. కాజల్ అగర్వాల్
9. రష్మిక మందన్న
10. నిఖితా తన్వాని
14వ స్థానంలో నభా నటేష్
16వ స్థానంలో ఇషా రెబ్బా
25వ స్థానంలో శ్రీముఖి నిలిచారు.


Click it and Unblock the Notifications











