సమంత యూటర్న్‌కు 20 లక్షలు.. యూట్యూబ్‌లో హవా!
రంగస్థలం, అభిమన్యుడు లాంటి బ్లాక్‌బస్టర్ విజయాలతో మంచి జోష్ మీద ఉన్న సమంత అక్కినేని మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం యూ-టర్న్ చిత్రాన్ని స్వయంగా నిర్మించి నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలై యూట్యూబ్‌లో సంచలనం రేపుతున్నది.
యూట్యూబ్ టీజర్‌ను ఆగస్టు 17న మధ్యాహ్నం విడుదల చేశారు. కేవలం ఒకరోజు గడవకముందే ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో 2 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. ఈ ట్రైలర్‌పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
యూటర్న్ చిత్ర ట్రైలర్ రెండు మిలియన్ల వ్యూస్‌ను సాధించిందని సమంత ట్విట్ చేశారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న రిలీజ్ కానున్నదని పేర్కొన్నారు.

కన్నడలో ఘన విజయం సాధించిన యూటర్న్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. సమంతతోపాటు ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ తదితరులు నటిస్తున్నారు. కన్నడలో దర్శకత్వం వహించిన పవన్ కుమార్ తెలుగు రీమేక్‌కు కూడా డైరెక్షన్ చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications











