సమంత డేరింగ్ డిసీజన్.. ఇకపై ఆ రంగంలో ఆమెదే హవా.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
అక్కినేని కోడలిగా, స్టార్ హీరోయిన్‌గా సమంత సూపర్ జోష్ కొనసాగిస్తోంది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత ఆమెకు అన్నీ కలిసొస్తున్నాయి. అక్కినేని కోడలిగా వారింట్లో అడుగుపెట్టాక ఆమెకు వరుస అవకాశాలు తలుపుతట్టడమే గాక, అన్నీ సూపర్ డూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో సమంత ఇంకాస్త డేర్ చేస్తూ సరికొత్తగా అడుగులేస్తోంది.
ఇప్పటికే డిజిటల్ రంగంలో కూడా సత్తా చాటేందుకు రెడీ అయిన సమంత వెబ్ సిరీసుల్లో నటిస్తోంది. ఇటు సినిమాలు చేస్తూనే అటు డిజిటల్ రంగంలో హవా కొనసాగిస్తానని ఆమె చెబుతోంది. ఇదిలా ఉండగానే మరో కొత్త స్టెప్ తీసుకుంది అక్కినేని సమంత. త్వరలో ఎడ్యుకేషన్ బిజినెస్ లోకి కూడా ప్రవేశిస్తోంది. ఫిబ్రవరి 7న రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు.

త్వరలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఏర్పాటు కానున్న 'ఏకమ్' అనే ప్రీ స్కూల్ నిర్వహణలో సమంత భాగస్వామి కానుండటం విశేషం. ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సామ్ వేస్తున్న అడుగులు భేష్ అంటున్నారు.
ఇకపోతే సమంత తాజా సినిమా 'జాను' విడుదలకు సిద్ధమవుతోంది. శర్వానంద్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ పోషిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ సాధించిన '96' మూవీకి ఇది రీమేక్. ఒరిజినల్‌ను రూపొందించిన సి. ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











