Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సింగపూర్‌లో సమంత.. భర్తతో కలిసి ఫుల్ ఎంజాయ్
సమంత తన భర్త నాగ చైతన్యతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. పదేళ్ల ప్రేమను వివాహాబంధంగా మలుచుకున్న జంట పక్షులు.. ప్రస్తుతం విదేశాల్లో విహరిస్తున్నారు. ఏమాయ చేశావే చిత్రంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సమంత, నాగ చైతన్య.. మంచి జంటగా పేరు తెచ్చుకున్నారు. అలా మొదలైన వీరి పరిచయం.. ప్రేమగా మారి.. పెళ్లి పీఠలవరకు చేరింది. రీసెంట్గా నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా సమంత చేసిన ఎమోషనల్ ట్వీట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
చైతూకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ సంతోషం కోసం ప్రతీ రోజూ ప్రార్ధనలు చేస్తాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. రోజు రోజుకు నువ్వు చాలా ఎదుగుతున్నావు.. నీకు నువ్వే బెస్ట్ అనిపించుకుంటున్నావు.. మన ఇద్దరి మధ్య బంధం చాలా దృఢమైనదని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను. ఐ లవ్యూ డార్లింగ్ అంటూ సమంత చేసిన ట్వీట్ హల్ చల్ చేసింది.
ఇక భర్త పుట్టిన రోజును పురస్కరించుకుని.. సమంత భారీగానే ప్లాన్ వేసింది. భర్త బర్త్ డే వేడుకులను విదేశాల్లో సెలెబ్రేట్ చేసుకోవాలని ప్రణాళిక వేసిన సమంత.. సింగపూర్‌లో తేలింది. వీరిద్దరు గత కొన్ని రోజులుగా అక్కడి వీధుల్లో తిరుగుతూ.. రెస్టారెంట్లలో అక్కడి ఫుడ్‌ను టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ రెస్టారెంట్ ఇద్దరూ కూర్చొని ఉన్న పిక్, ఏదో కొత్త వంటకాన్ని ట్రై చేస్తోన్న పిక్‌ను షేర్ చేసింది. సమంత ప్రస్తుతం ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్‌లో నటిస్తోండగా.. నాగచైతన్య వెంకీమామ, శేఖర్ కమ్ముల చిత్రాలతో బిజీగా ఉన్నాడు.