twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సింగపూర్‌లో సమంత.. భర్తతో కలిసి ఫుల్ ఎంజాయ్

    |

    సమంత తన భర్త నాగ చైతన్యతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. పదేళ్ల ప్రేమను వివాహాబంధంగా మలుచుకున్న జంట పక్షులు.. ప్రస్తుతం విదేశాల్లో విహరిస్తున్నారు. ఏమాయ చేశావే చిత్రంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సమంత, నాగ చైతన్య.. మంచి జంటగా పేరు తెచ్చుకున్నారు. అలా మొదలైన వీరి పరిచయం.. ప్రేమగా మారి.. పెళ్లి పీఠలవరకు చేరింది. రీసెంట్‌గా నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా సమంత చేసిన ఎమోషనల్ ట్వీట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

    చైతూకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ సంతోషం కోసం ప్రతీ రోజూ ప్రార్ధనలు చేస్తాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. రోజు రోజుకు నువ్వు చాలా ఎదుగుతున్నావు.. నీకు నువ్వే బెస్ట్ అనిపించుకుంటున్నావు.. మన ఇద్దరి మధ్య బంధం చాలా దృఢమైనదని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను. ఐ లవ్యూ డార్లింగ్‌ అంటూ సమంత చేసిన ట్వీట్ హల్ చల్ చేసింది.

    Samantha And Naga Chaitanya Enjoying AT Singapore

    ఇక భర్త పుట్టిన రోజును పురస్కరించుకుని.. సమంత భారీగానే ప్లాన్ వేసింది. భర్త బర్త్ డే వేడుకులను విదేశాల్లో సెలెబ్రేట్ చేసుకోవాలని ప్రణాళిక వేసిన సమంత.. సింగపూర్‌లో తేలింది. వీరిద్దరు గత కొన్ని రోజులుగా అక్కడి వీధుల్లో తిరుగుతూ.. రెస్టారెంట్లలో అక్కడి ఫుడ్‌ను టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ రెస్టారెంట్ ఇద్దరూ కూర్చొని ఉన్న పిక్‌, ఏదో కొత్త వంటకాన్ని ట్రై చేస్తోన్న పిక్‌ను షేర్ చేసింది. సమంత ప్రస్తుతం ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్‌లో నటిస్తోండగా.. నాగచైతన్య వెంకీమామ, శేఖర్ కమ్ముల చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

    English summary
    Samantha And Naga Chaitanya Enjoying AT Singapore. After wrapping up their work commitments, Samantha and Naga Chaitanya have jetted off to Singapore to chill.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X