ఎమోషనల్ టచ్ ఇచ్చిన జాను ట్రైలర్..
తమిళ నాట విడుదలై మొత్తం దక్షిణాదిని ఓ ఊపు ఊపిన చిత్రం 96. అప్పటి వరకు ఫేడవుట్ భామ అంటూ త్రిషను వేలెత్తి చూపిన వారంతా.. ఆమె కోసం క్యూలో నిలబడ్డారు. అంతలా ఆమె కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం 96. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 చిత్రం కోలీవుడ్‌లో సంచలనాలు నమోదు చేసింది. ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన 96ను తెలుగులో జానుగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
సమంత, శర్వానంద్ జంటగా నటిస్తోన్న జాను.. ఇప్పటికే టీజర్, సాంగ్స్‌తో ఓ రేంజ్ అంచనాలు పెంచేసింది. 96 సినిమాకు గోవింద్ వసంత్ అందించిన సంగీతం ఎంత ప్లస్ అయిందో.. జాను విషయంలోనూ అదే రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ఊహలే ఊహలే పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. 'ఎగిసిపడే ఈ కెరటాలు నువ్వు.. ఎదురుచూసే ఈ సముద్ర తీరాన్ని నేను.. పిల్లగాలి కోసం ఎదురుచూసే నల్లమబ్బులా.. ఓర చూపు కోసం..దోర నవ్వుల కోసం రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది.. నా హృదయం.. నా వైపు ఓ చూపు అప్పు ఇవ్వవా..?' లాంటి ఎన్నో ఎమోషనల్ డైలాగ్స్‌తో టచ్ చేసింది జాను ట్రైలర్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా..మాతృకను తెరకెక్కించిన సీ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేసేందుకు సిద్దమయ్యారు.


Click it and Unblock the Notifications











