జాను టీజర్.. ఒరిజినల్ ఫీల్‌ను కంటిన్యూ చేస్తూ... సమంత-శర్వానంద్ మ్యాజిక్
తమిళ నాట సంచలనం సృష్టించి.. త్రిష కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం 96. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 చిత్రం కోలీవుడ్‌లో సంచలనాలు నమోదు చేసింది. ఈ చిత్రానికి, త్రిషకు లెక్కలేనన్ని అవార్డులను తెచ్చిపెట్టింది. ఈ సినిమా విడదులయ్యాక దక్షిణాదిన టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

తెలుగులో రీమేక్..
ఎక్కడ చూసినా 96 గురించే వార్తలు వినిపించాయి. అంతగా మెస్మరైజ్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రీమేక్ చేసేందుకు దిల్ రాజు ముందుకు వచ్చాడు. ఆ కథలో ఉన్న ఫీల్‌ను తెలుగు ప్రేక్షకులకు కూడా రుచి చూపించేందుకు సిద్దమయ్యాడు. 96ను తెరకెక్కించిన దర్శకుడు ప్రేమ్ కుమార్.. రీమేక్‌ను సైతం అందంగా మలిచినట్టు టాక్.

శర్వానంద్ సాహసాలు..
ఈ చిత్రం కోసం శర్వానంద్ చేసిన సాహసం కారణంగానే ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సమంత ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ సమంత కెరీర్‌లో నిలిచిపోవడం ఖాయమని టాక్ నడుస్తోంది.
జానుగా సమంత..
శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రానికి జాను అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సమంత పాత్ర తాలుకూ లుక్ విడుదల చేయలేదని ఆమె ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు.

టీజర్‌తో సమంత ఫ్యాన్స్ కూల్..
96 సినిమాలో ఏదైతే ఫీల్ ఉందో.. దాన్ని మిస్ చేయకుండా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో సమంత లుక్స్ కూడా త్రిషను పోలీనట్టే ఉండటం, విజయ్ సేతుపతిని శర్వానంద్ మ్యాచ్ చేసేలానే ఉన్నాడు. ఇక వీరిద్దరి కెమెస్ట్రీ అందర్నీ ఆకట్టుకునేలానే ఉంది.


Click it and Unblock the Notifications











