ఆ రోజుల్లో చుక్కలు చూపించిన సమంతా-సిద్ధార్థ్'ల జబర్దస్త్.. ఎందుకు వివాదం అయిందంటే?
స్టార్ హీరోయిన్ సమంత నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలిస్తూనే ఉంది. నాగ చైతన్యతో వివాహ బంధం నుంచి విడిపోయిన తర్వాత సమంత ఏది చేసినా అది వార్తే అయిపోయింది. ఆమె చేస్తున్న సోషల్ మీడియా పోస్టుల గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఆమె నటించిన ఒక పాత సినిమా సంగతి మీ ముందుకు తీసుకు వస్తున్నాం. ఆ సినిమా విడుదలై నేటికి(ఫిబ్రవరి 22కి) తొమ్మిదేళ్ళు పూర్తి అయ్యాయి. ఆ సినిమా వివాదాస్పదం అయింది. ఎందుకో తెలుసుకుందాం

సాలిడ్ రిలేషన్‌షిప్‌లో
నాగ చైతన్యతో ప్రేమలో పడక ముందు సమంత.. సిద్ధార్థ్ మధ్య ప్రేమ చానళ్ళ పాటు సాగింది. వీరిద్దరూ చాలా కాలం ప్రేమించుకుని తర్వాత వివాదాల కారణంగా విడిపోయారు. సమంత, సిద్దార్థ్ కలిసి ఉన్నప్పుడు వారు నటించిన జబర్డస్త్ అనే చిత్రం 2013లో విడుదలైంది. అప్పుడప్పుడే డైరెక్టర్ గా నిలదొక్కుకుంటున్న నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
ఈ సినిమా అనౌన్స్ చేసేనాటికి సమంత మరియు సిద్ధార్థ్ సాలిడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.

కాపీ చేశారు అంటూ
దర్శకురాలు నందినీ రెడ్డి వారిని జబర్దస్త్ కోసం ఏకతాటిపైకి తీసుకొచ్చినప్పుడు ఆ సినిమా వార్తల్లో నిలిచింది. సినిమా విడుదల కోసం వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అలా ఎట్టకేలకు జబర్దస్త్ ఫిబ్రవరి 22, 2013న థియేటర్లలోకి వచ్చింది. సినిమా అల విడుదల అయిందో లేదో, ఈ సినిమా రన్ వీర్ సింగ్, అనుష్క శర్మ జంటగా నటించిన బ్యాండ్ బాజా భారత్ అనే సినిమాను పోలి ఉండడంతో ఇంకేముంది కాపీ చేశారు అంటూ ఆరోపణలు వచ్చాయి.

తమిళంలో
దీనిపై యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ కోర్టు మెట్లు కూడా ఎక్కింది. అప్పట్లో సిద్ధార్థ్, సమంత ప్రేమ వ్యవహారం గురించి మీడియాలో వార్తలు వస్తుండటం, ఈ ఇద్దరూ తమిళంలో కూడా మంచి పేరు తెచ్చుకుని ఉండడంతో ఈ జోడికి తమిళంలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. వీరి క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని తమిళ దర్శకుడు లింగుస్వామి ప్రయత్నించారు. తమిళంలో జబర్దస్త్ చిత్రాన్ని డుం డుం పీ పీ పేరుతొ డబ్ చేసి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఆ సినిమాను పోలి ఉండడంతో
ఈ మేరకు డబ్బింగ్ హక్కులు సొంతం చేసుకున్నారు. కానీ యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఆయన ప్లాన్ కు అయిత్గే అడ్డుకట్ట వేసింది. జబర్దస్త్ చిత్రంలోని చాలా సన్నివేశాలు బ్యాండ్ బాజా భారత్ ని పోలి ఉన్నాయని గుర్తించిన కోర్టు స్టే విధించింది. జబర్దస్త్ చిత్రాన్ని డబ్ చేయకూడదని, డివిడి, టీవీలలో ప్రసారం చేయకూడదు అని కోర్టు స్టే ఇచ్చింది.
Recommended Video

రెండిటికీ డిజాస్టర్ ఫలితం
ఈ క్రమంలో లింగుస్వామికి ఎదురుదెబ్బ తప్పలేదు. ఇక యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఆలస్యం చేయకుండా బ్యాండ్ బాజా భారత్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేశారు. ఇందులో మన హీరో నాని, వాణి కపూర్ జంటగా నటించారు. కానీ సినిమా ఆకట్టుకోలేదు. అంతే కాక నిరాశపరిచింది. సమంత, సిద్దార్థ్ నటించిన జబర్దస్త్.. కూడా దారుణంగా నిరాశపరిచింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన కొంత కాలానికి సమంత, సిద్ధార్థ్ విడిపోయారు.


Click it and Unblock the Notifications











