twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున ఇంటిలో గ్రాండ్ పార్టీ.. సమంతను దూరం పెట్టిన చైతూ.. లేటేస్ట్ ఫోటో వైరల్

    |

    టాలీవుడ్‌లో స్టార్ కపుల్ సమంత, నాగచైతన్య అక్కినేని దంపతులు విడిపోతున్నారనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే మీడియాలో వైరల్‌గా మారుతున్న వార్తలను పట్టించుకోకుండా అక్కినేని ఫ్యామిలీ తమ పంథాలో పార్టీలు, సెలబ్రేషన్స్‌లో బిజీగా కనిపిస్తున్నారు. భర్త నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నారనే వార్తల మధ్య ఆమె అక్కినేని ఫ్యామిలీకి దూరమవుతున్నారనే వార్తకు బలం చేకూరేలా ఓ ఫోటో మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటో వెనక కథ ఏమిటంటే..

    లవ్ స్టోరి సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా

    లవ్ స్టోరి సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా

    సమంతకు డైవర్స్ ఇస్తున్నారనే విషయం పక్కన పెడితే లవ్ స్టోరి ప్రమోషన్స్‌లో నాగచైతన్య కూల్‌గా కనిపించారు. ఏమాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా తన పని తాను చూసుకొంటూ వెళ్లిపోతున్నారు. తన కెరీర్‌లో అత్యంత కీలకంగా మారిన లవ్ స్టోరి సినిమా ప్రమోషన్స్‌పై చైతూ గురిపెట్టారు. సమంత వివాదం విషయంలో మీడియాకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా సక్సెస్‌పుల్‌గా ప్రమోషన్స్ కంప్లీట్ చేశారు.

    అమీర్ ఖాన్ రాకతో గ్రాండ్‌గా

    అమీర్ ఖాన్ రాకతో గ్రాండ్‌గా

    లవ్ స్టోరి చిత్రంలో నటిస్తున్న సమయంలోనే చైతూ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అమీర్ ఖాన్ స్వయంగా పిలిచి ఆయన నటించి నిర్మిస్తున్న లాల్ సింగ్ చద్దా మూవీలో కీలక పాత్రను చైతుకు ఇచ్చారు. దాంతో అమీర్, చైతూ మధ్య బలమైన అనుబంధం ఏర్పడింది. దాంతో లవ్ స్టోరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్వయంగా వస్తానని చెప్పడంతో ఆ వేడుకలో అమీర్ ఖాన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు.

    ప్రేమనగర్ రిలీజ్ రోజునే లవ్ స్టోరి

    ప్రేమనగర్ రిలీజ్ రోజునే లవ్ స్టోరి

    ఇక తన కుమారుడు చైతూ లవ్ స్టోరి రిలీజ్ రోజు నాగార్జునకు ప్రత్యేకంగా మారింది. సెప్టెంబర్ 24వ తేదీన తన తండ్రి, స్వర్గీయ నాగేశ్వరరావు అక్కినేని నటించిన ప్రేమ నగర్ చిత్రం రిలీజ్ అయి 50 ఏళ్లు అవుతున్నది. ఈ సందర్భంగా తన తండ్రి స్మారకంగా ఆ రోజును తలుచుకొని నాగార్జున ఎమోషనల్ అయ్యారని తెలిసింది. ప్రేమనగర్ రిలీజ్ రోజునే లవ్ స్టోరి విడుదల కావడం అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకంగా మారింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నాగార్జున అమీర్ ఖాన్‌ను తన ఇంటికి ఆహ్వానించి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు.

    అమీర్ ఖాన్‌కు నాగ్ గ్రాండ్ పార్టీ

    అమీర్ ఖాన్‌కు నాగ్ గ్రాండ్ పార్టీ

    ఇక లవ్ స్టోరి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అమీర్ ఖాన్‌కు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గ్రాండ్ పార్టీని అరెంజ్ చేశారు. ఈ పార్టీకి లవ్ స్టోరి సినిమా యూనిట్‌‌లోని సాయి పల్లవి, శేఖర్ కమ్ముల తదితరులు హాజరయ్యారు. ఈ పార్టీలో అఖిల్‌తోపాటు అక్కినేని కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ పార్టీలో ఎక్కడా సమంత కనిపించకపోవడంతో ఊహాగానాలు జోరందుకొన్నాయి. అక్కినేని కుటుంబంతో ఉన్న విభేదాల కారణంగానే ఆ పార్టీకి సమంత దూరమైందనే వార్తలు మరోసారి గుప్పుమన్నాయి.

    Recommended Video

    Why Love Story Is A Must Watch | Naga Chaitanya, Sai Pallavi కెరీర్ బెస్ట్ || FIlmibeat Telugu
    తాత నటించిన పాత్ర పేరుతో నాగచైతన్య

    తాత నటించిన పాత్ర పేరుతో నాగచైతన్య

    ఇక ఇదిలా ఉంటే.. నాగచైతన్య కెరీర్ పరంగా గ్రాండ్‌గా ప్లాన్ చేసుకొంటున్నట్టు కనిపిస్తున్నారు. తన తండ్రితో కలిసి బంగార్రాజు చిత్రంలో బాలరాజు అనే పాత్రలో కనిపించబోతున్నారు. తన తాత 70 ఏళ్ల క్రితం నటించిన బాలరాజు అనే చిత్రంలోని పాత్ర పేరుతో చైతూ కనిపించనున్నారు. అలాగే థ్యాంక్యూ అనే చిత్రంతోపాటు విక్రమ్ కుమార్‌తో కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నారు.

    English summary
    Naga Chaitanya divorce rumours with Samantha is hot topic in the Industry, In this occassion, Samantha away from Nagarjuna Akkineni dinner party to Aamir Khan photo goes viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X