చనిపోతారని అనుకున్నారట.. కరొనా భారిన పడిన సమంత స్నేహితురాలు ఇప్పుడు ఎలా ఉందంటే?
సినిమా ఇండస్ట్రీలలో కూడా ప్రస్తుతం కరోనా మహమ్మారి దూకుడు ఎక్కువైంది. ఆ వైరస్ రాకుండా ఉండేందుకు సెలబ్రెటీస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు షూటింగ్ పనులకు మరోసారి బ్రేకప్ చెప్పారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య షాక్ కి గురి చేస్తోంది. రీసెంట్ గా అక్కినేని ఫ్యామిలికి అత్యంత సన్నిహితురాలైన ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై ఆమె మొదటిసారి స్పందించారు. ఆమె ఆ వైరస్ నుంచి చాలా తొందరగానే కొలుకున్నారు.

సమంతను కలవడంతో..
శిల్పా రెడ్డికి అలాగే ఆమె భర్తకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అందరు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె ఇటీవల కొంతమందికి స్టార్స్ కి దగ్గరగా ఉన్నారని టాక్ వచ్చింది. ముఖ్యంగా సమంతను రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారని అందరికి తెలిసిమ విషయమే. అక్కినేని ఫ్యామిలీలో కూడా కరోనా భయం కాస్త కలవరపెట్టింది. కానీ ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని ముందుగానే క్లారిటీ ఇచ్చారు.

అపోహలు వద్దు..
ఇక కరోనా భారిన పడిన తరువాత చాలా తొందరగా గా వ్యాధి నుంచి బయటఓడినట్లు శిల్పా రెడ్డి వివరణ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. కరోనా అనగానే చాలా మందిలో అపోహలు బయలు పుట్టుకొస్తున్నాయి. కరోనా వచ్చింది అంటే.. ఇక అంతే అనే వాళ్ళు కూడా ఉన్నారు. కరోనా వచ్చింది అనగానే మా దగ్గర పని చేసేవాళ్ళు ఫోన్ చేసి ఏడ్చారు.

చనిపోతామని అనుకున్నారు..
మేము చనిపోతామేమో అని చాలా మంది అనుకున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా ఈ భయంలో ఉన్నారు. నాకు మా ఆయనకు కరోనా సోకింది అనగానే ఎక్కువగా మేము ఫిట్నెస్ పై దృష్టి పెట్టాము. కరోనా సోకింది అంటే ఆరోగ్యం చాలా త్వరగా క్షిణిస్తుంది. అయితే ఎక్కువగా ఫిట్నెస్ ఊపిరితిత్తుల సామర్థ్యం మీద అది ఆధారపడి ఉంటుంది.
Recommended Video

కరోనా తగ్గడానికి కారణమిదే..
నేను ఎక్కువగా వ్యాయామం చేశాను. ముఖ్యంగా ఊపిరితిత్తులు బలపడే కార్డియో వ్యాస్కులర్ వ్యాయామంతో పాటు ప్రాణాయామం వంటివి చేశాను. గ్యాప్ లేకుండా ఫిట్నెస్ పై పట్టు సాధించడం వలన కరోనా నుంచి చాలా తొందరగా కొలుకున్నాను అంటూ.. ఎలాంటి అపోహలకు లోనవ్వకుండా ఆరోగ్యంగా ఉంటూ వ్యాయామం చేయగలిగితే కరోనాను తరిమికొట్టవచ్చని శిల్పా రెడ్డి తెలిపారు.


Click it and Unblock the Notifications











