భర్తను పక్కన పెట్టుకుని మరీ వెక్కిరిస్తోన్న సమంత.. పోస్ట్ వైరల్
సమంత చేసే చిలిపి చేష్టల గురించి అందరికీ తెలిసిందే. భర్త నాగ చైతన్యను అయితే మరింత ఏడిపిస్తూ ఉంటుంది. అతను వంటగదిలో వంటలు చేస్తోన్న పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, పెట్స్‌తో ఆడుకుంటున్నప్పుడు వీడియోలు తీసి షేర్ చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది. తాజాగా సమంత చేసిన ఓ పోస్ట్, షేర్ చేసిన పిక్‌ను చూస్తే సమంత ఎంత కొంటెదో అర్థమవుతుంది.

క్యూట్ కపుల్‌గా క్రేజ్..
ఏమాయ చేశావే చిత్రంతో తొలిసారి స్క్రీన్‌పై కలిసి నటించిన వీరి మధ్యలో స్నేహం మొదలై అది ప్రేమగా మారింది. దాదాపు పదేళ్ల తరువాత వివాహాబంధంతో ఒక్కటయ్యారు. సిల్వర్ స్క్రీన్‌పై లక్కీ పెయిర్‌గా క్రేజ్ తెచ్చుకున్న చై-సామ్‌లు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

మజిలీతో హిట్ కొట్టిన జంట..
రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌ను రీల్ లైఫ్‌లో పోషించి అందర్నీ మెప్పించారు.శ్రావణి, పూర్ణలుగా అదిరిపోయే పాత్రలను పోషించి మంచి హిట్‌ను సొంతం చేసుకున్నారు. పెళ్లాయ్యాక కలిసి నటించిన ఈ మొదటి చిత్రం సూపర్ హిట్ కావడంతో మళ్లీ లక్కీ పెయిర్‌గా నిరూపించుకున్నారు.

పలు ప్రాజెక్ట్‌లతో ఇరువురు బిజీ
పెళ్లయ్యాక స్పీడ్ పెంచిన సమంత.. వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా వెబ్ సిరీస్‌లోనూ అడుగు పెట్టింది. సూపర్ హిట్ అయిన ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2లో ఓ కీ రోల్ ప్లే చేస్తోంది. మరో వైపు నాగచైతన్య వెంకీమామతో బిజీగా ఉన్నాడు. ఇలా పెళ్లయ్యాక వీరిద్దరు ఫుల్ బిజీగా ఉన్నారు.
Recommended Video
వెక్కిరిస్తూ ఫోటో
నేనో అద్భుతమని ఆయనకు తెలుసంటూ.. వెక్కిరిస్తూ కోతిలా ఫేస్ పెట్టేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికీ ఈ పిక్‌ను ఎనిమిది లక్షల మందికిపైగా లైక్ చేయగా.. పలువురు సెలెబ్రిటీలు సైతం కామెంట్లు చేశారు.


Click it and Unblock the Notifications











