Samantha Temple: సమంత కోసం గుడి కట్టిన ఫ్యాన్.. నెటిజన్లు ఫైర్.. ఖర్చు ఎంతో తెలుసా?
సినీ హీరో హీరోయిన్లపై ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం, ప్రేమ ఉంటుంది. వారి నటన, డ్యాన్స్, హావాభావాలకు ఫిదా అయి అభిమానులుగా మారుతుంటారు. ఇక వారి అభిమాన తారల కోసం ఫ్యాన్స్ ఏం చేసేందుకైన సిద్ధపడుతుంటారు. కొందరు వాళ్ల పేరుతో మంచి పనులు చేస్తే.. మరికొందరు ఇతరులు మరణాలకు కారణం అవుతుంటారు. అయితే పలువురు మాత్రం వారి బీభత్సమైన అభిమానాన్ని గుడి కట్టి మరి చూపిస్తారు. తాజాగా అలాంటి అరుదైన గౌరవాన్ని స్టార్ హీరోయిన్ సమంత దక్కించుకుంది.
బాక్సాఫీస్ వద్ద అలా: ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయి అందరినీ మాయ చేసింది ముద్దగుమ్మ సమంత. తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ అందుకున్న ఈ చిన్నది తర్వాత అనేక మంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుసగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న ఈ బ్యూటి ఇటీవల శాకుతంలంతో ప్రేక్షకుల ముందుకు రాగా అది బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
భారతీయ వెర్షన్: ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత సిటాడెల్ అనే ఇంగ్లీషు వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ షూటింగ్ లో బిజీ కానుంది. గ్లోబస్ స్టార్ ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్ రోల్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. హై ఓల్టేజ్ యాక్షన్, రొమాంటిక్ సీన్లతో నిండి ఉన్న ఈ సిరీసులో భారతీయ వెర్షన్ లో త్వరలో సామ్ నటించనుంది.

వారి జాబితాలోకి: ఇదిలా ఉంటే సమంత వీరాభిమాని ఒకరు ఆమెకు గుడి కట్టి ఆశ్చర్యపరిచాడు. ఇదివరకు సీనియర్ హీరోయిన్ కుష్బూ, నయనతార, హన్సిక, నిధి అగర్వాల్, నమితకు వారి అభిమానులకు గుడి కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఆ హీరోయిన్ల జాబితాలోకి యాపిల్ బ్యూటి సమంత చేరింది.
పుట్టినరోజు వేడుకలు: ముద్దగుమ్మ సమంతకు ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల నివాసి అయిన తెనాలి సందీప్ వీరాభిమాని. ఆమె మయోసైటిస్ బారిన పడినప్పుడు కోలుకోవాలంటూ తిరుపతి, చెన్నై, నాగ పట్నంలో మొక్కుబడి యాత్ర చేశాడు. ఇప్పుడు ఏకంగా సమంతకు గుడి కట్టాడు. బాపట్లలోని ఆలపాడు సందీప్ స్వస్థలం. ఆలపాడులోని తమ సొంత ఇంట్లో సామ్ కోసం గుడి కట్టడమే కాకుండా ఆమె పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించాడు.

సందడిగా.. వీడియో వైరల్: ఏప్రిల్ 28న అంటే శుక్రవారం రోజున సమంత బర్త్ డే సందర్భంగా ఆమె కోసం కట్టిన గుడిని ప్రారంభించి పలువురిని పిలిచి వేడుకలు చేశాడు. ఈ వేడుకలకు స్థానికులు హాజరు కావడంతో అక్కడ సందడిగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత నవ్వుతున్న విగ్రహాన్ని ప్రతిష్టించి గుడిలో పూజలు నిర్వహిస్తున్నాడు సామ్ అభిమాని సందీప్.
అలా డై హార్డ్ ఫ్యాన్: "నేను 2010లో ఏ మాయ చేశావే సినిమా నుంచి సమంతకు పెద్ద అభిమానిని. 2012 నుంచి మేడమ్ గారు స్వచ్ఛంద సంస్థలు నడుపుతు పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ అవి నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి నేను ఇంకా డై హార్డ్ ఫ్యాన్ అయ్యాను. మూడు నాలుగు సంవత్సరాల నుంచి సమంత గారి కోసం ఏదైనా చేయాలని అనుకున్నాను. అందుకే ఈ గుడి కట్టాను"అని సమంత అభిమాని తెనాలి సందీప్ చెప్పుకొచ్చాడు.

అభిమానులు ఫైర్: అయితే సమంత గుడి కోసం సందీప్ సుమారు రూ. 5 నుంచి 6 లక్షల ఖర్చు చేశాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సమంత గుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు, అభిమానులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గుడి ఓకే.. కానీ ఆ విగ్రహం ఏంటీ, అందులో సమంత ఎక్కడ ఉంది.. అంటూ ఫైర్ అవుతున్నారు. కాగా ఇలా ఏపీలో గుడి కట్టించుకున్న తొలి హీరోయిన్ గా సమంత నిలిచినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











