ఆర్జీవి మీరేమైనా సుద్దపూసనా? పవన్ తల్లిని శ్రీరెడ్డితో తిట్టించలేదా? ఇప్పుడు నీతులు వల్లిస్తున్నావా?

సమంత రుత్ ప్రభు విడాకుల విషయంలో కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. గాంధీ జయంతి సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో సమంత, నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అంటూ మంత్రి బాంబు పేల్చారు. ఆమె చేసిన వ్యాఖ్యలు మీడియాలో సంచలనంగా మారాయి. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై సినీ అభిమానులు, మెగా, పవర్ స్టార్ అభిమానులు మరింత ఘాటుగా స్పందిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

మంత్రి హోదాలో కొండా సురేఖ మెదక్ జిల్లాలో పర్యటించినప్పుడు ఎంపీ రఘునందన్ రావు ఆమెను సన్మానించారు. ఆ విషయాన్ని టార్గెట్‌గా చేసుకొని బీఆర్ఎస్ శ్రేణులు నీచమైన కామెంట్లు చేస్తూ వారిద్దరిని ట్రోల్ చేశారు. ఎంపీతో కొండాకు లింక్ చేస్తూ దుర్బాషలాడారు. మహిళ అనే విషయం పట్టించుకోకుండా ఆమె ప్రతిష్టను దిగజార్చేలా కామెంట్స్ చేయడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కేటీఆర్ వల్లే సమంత విడాకులు తీసుకొన్నదని తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించారు.

Samantha Divorce Row Netizens trolls Ram Gopal Varma post on Konda Surekha comments

అయితే అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేయడంపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. 4th గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణం. ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్య లాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలి అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలి. ఇలాంటివి భవిష్యత్‌లో జరగకుండా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి. ఈ వివాదం చాలా బాధాకరం.. ఇండస్ట్రీ నుంచి మేము అడుగుతున్నాం అని రాంగోపాల్ వర్మ కామెంట్ చేశారు. అయితే వర్మ నీతులు చెప్పడంపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు.

Samantha Divorce Row Netizens trolls Ram Gopal Varma post on Konda Surekha comments

అక్కినేని ఫ్యామిలీ విషయంలో స్పందించడం ఒకే. కానీ వైసీపీ వాళ్ల వద్ద డబ్బులు తీసుకొని ఆడాళ్లను తిట్టించిన వారిలో బ్యాచ్‌లో నీవు ఒకడివి. ఈ రోజు వచ్చి నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నావా? మీలాంటి వాళ్ల సపోర్ట్ లేకపోవడమే నాగార్జున గారికి పెద్ద సపోర్ట్ అవ్వుద్ది. సో కొంచెం అంటూ ఓ నెటిజన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

మీటూ ఉద్యమం సందర్భంగా పవన్ కల్యాణ్‌ తల్లి అంజనా దేవీని శ్రీరెడ్డి చేత తిట్టించడం వెనుక వర్మ ఉన్నారనే విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత నేనే శ్రీరెడ్డిని తిట్టమని చెప్పానని ఆయనే ఒప్పుకొన్నారు. మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేయించిన మీరు ఇప్పుడు సుద్దపూసలా మాట్లాడటం తగదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X