twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీకోసం ప్రతీరోజూ అది చేస్తాను.. ఐ లవ్యూ డార్లింగ్.. సమంత పోస్ట్ వైరల్..

    |

    టాలీవుడ్ క్యూట్ కపుల్ ఎవరంటే.. అందరూ నాగచైతన్య, సమంత పేరు చెబుతారు. రీల్ లైఫ్‌లోనే మంచి భార్యాభర్తలుగా కాకుండా రియల్ లైఫ్‌లోనూ అంతే అన్యోన్యంగా ఉంటూ సరదాగా గడిపేస్తుంటారు. వీలు దొరికనప్పుడల్లా అలా విదేశాలకు షికారుకెల్తారు. ఈ జంట సోషల్ మీడియాలో చేసే హల్ చల్ మామూలుగా ఉండదు. చైతు కాస్త మొహమాటంగానే ఉన్నా.. సమంత మాత్రం సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉంటుంది.

    నేడు చై పుట్టినరోజు..

    నేడు చై పుట్టినరోజు..

    నేడు నాగ చైతన్య పుట్టిన రోజ సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ మామూలుగా విషెస్ చెప్పినా.. తన భార్య చెప్పే విషెస్ ఎంతో ప్రత్యేకంగానే ఉంటుంది. తన భర్త పుట్టిన రోజున సమంత చేసిన పోస్ట్ కాస్త ఎమోషనల్‌గా ఉండటంతో అది తెగ వైరల్ అవుతోంది.

    ఐ లవ్యూ డార్లింగ్‌

    ‘చైతూకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ సంతోషం కోసం ప్రతీ రోజూ ప్రార్ధనలు చేస్తాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. రోజు రోజుకు నువ్వు చాలా ఎదుగుతున్నావు.. నీకు నువ్వే బెస్ట్ అనిపించుకుంటున్నావు.. మన ఇద్దరి మధ్య బంధం చాలా దృఢమైనదని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను. ఐ లవ్యూ డార్లింగ్‌' అని సోషల్ మీడియాలో సమంత పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.

    ఈ పోస్ట్‌కు సెలెబ్రిటీల కామెంట్లు..

    ఈ పోస్ట్‌కు సెలెబ్రిటీల కామెంట్లు..

    సమంత చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లే కాకుండా పలువురు సెలెబ్రిటీలు కూడా కామెంట్లు చేశారు. నమత్రా శిరోద్కర్, హన్సిక, రకుల్, అఖిల్, నందినీ రెడ్డి, స్వప్నా దత్ లాంటి వారు నాగచైతన్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపగా.. తిరిగి వారందరికీ సమంత ధన్యవాదాలను తెలిపింది.

    Recommended Video

    #CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
    బర్త్ డే స్పెషల్‌గా నాగ చైతన్య ప్రపంచం..

    బర్త్ డే స్పెషల్‌గా నాగ చైతన్య ప్రపంచం..

    శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తోన్న సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య మరింత రా లుక్‌లో కనిపిస్తున్నాడు. సాధారణ కుటుంబంలోని కుర్రాడిలా ఇంట్లో చీపురు పట్టుకుని ఊడుస్తున్నాడు. బీరువాలో ఉన్న డబ్బులు లెక్కపెట్టుకుంటున్నాడు. పిల్లలతో ఆడుకుంటూ సంతోషంగా ఉన్నట్లు, ఏదో తెలియని గతం కూడా ఉన్నట్లు, దాన్ని తలుచుకుని బాధపడుతున్నట్లు ఇలా అతనికి సంబంధించిన భావోద్వేగాలన్నింటిని చూపించాడు.

    English summary
    Samantha Emotional Wishes To Naga Chaitanya. Happy birthday my chayakkineni .. Every single day I pray for your happiness and I am so proud that with every passing day you have grown to be the best version of yourself .. and I believe with all my heart that we are stronger together ..I love you darling husband
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X