సమంత క్రేజ్‌కు ఈ వీడియోనే సాక్ష్యం.. ఏం చెప్పాలో తెలియడం లేదు.. సమంత ఎమోషనల్ ట్వీట్
సమంత, శర్వానంద్ జంటగా నటించిన జాను చిత్రం నేడు (ఫిబ్రవరి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చేసింది. మ్యాజిక్ రీ క్రియేట్ అయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి. జాను సినిమాపై సోషల్ మీడియాలో వస్తోన్న కామెంట్లకు సమంత రియాక్ట్ అవుతూ రిప్లై ఇస్తోంది.

ఎందరి కలో..
జాను సినిమాలో సమంత ఎంట్రీ సీన్‌కు థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. మూవీ మొదలై దాదాపు గంట గడిచాక సమంత ఎంట్రీ ఇస్తుంది. అలాంటప్పుడు ఆ ఎంట్రీ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోండి.

అరుపులు కేకలు..
సమంత ఎంట్రీకి, ఆ సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కు థియేటర్లలో ప్రేక్షకులు విజిల్స్ వేయాల్సిందే. అరుపులు, కేకలతో థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. ఈ సీన్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ క్రేజ్‌కు సమంత ఫిదా..
జాను ఎంట్రీకి వచ్చిన రెస్పాన్స్ చూసి సమంత ఫిదా అయింది. వీటిపై సమంత స్పందిస్తూ.. నిజంగా ఏం చెప్పాలో నాకు తెలియడం లేదంటూ దండం పెట్టేసింది. ఇలాంటి ఎంట్రీ ఎవరికైనా ఓ డ్రీమ్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. సమంతకు ఇలాంటి సీన్ పడటం సబబే అంటూ వీడియోను షేర్ చేశాడు.

సమంతపై ప్రశంసల జల్లు
జాను చిత్రాన్ని వీక్షించిన ప్రతీ ఒక్కరూ సమంత నటనను పొగడకుండా ఉండలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ టాపిక్కే వైరల్ అవుతోంది. జానుగా సమంత మాయ చేసిందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











