Samantha పరువు నష్టం దావా.. ఆ మూడు ఛానల్స్‌పై కోర్టులో కేసు! ఆ పొలిటికల్ లీడర్‌ను వదలకుండా..

ఇటీవల కాలంలో సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక రకాల రూమర్స్ పై సోషల్ మీడియాలో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే వ్యక్తిగత విషయాలపై కొంత ప్రైవసీ అవసరమని ముందుగానే సమంత సోషల్ మీడియా ద్వారా కోరినప్పటికీ కూడా కొంతమంది ఆమె పర్సనల్ విషయాల పై అనేక రకాల కారణాలను ప్రచారం చేయడం వివాదానికి దారితీసింది. ఇక ఫైనల్ గా సమంత కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేయడానికి కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించింది. యూ ట్యూబ్ ఛానెల్స్ పేర్లను కూడా ఆమె కేసులో నమోదు చేశారు.

 మనసుకు బాధ కలిగించే వార్తలు

మనసుకు బాధ కలిగించే వార్తలు

అక్కినేని సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ పరిణామం ముందు నుంచి కూడా సమంత వ్యక్తిగత విషయం పై కొన్ని యూట్యూబ్ చానల్స్ లో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సోషల్ మీడియాలో అంతకు మించి అని అనేలా కొన్ని రూమర్స్ వైరల్ అయ్యాయి. అంతేకాకుండా విడాకులకు గల కారణం కూడా ఇదే అంటూ కొంతమంది ఆమె మనసుకు బాధ కలిగించే వార్తలను ప్రచారం చేసినట్లు తెలుస్తోంది.

పరువు నష్టం దావా

పరువు నష్టం దావా

ఇక చాలావరకు రూమర్స్ పై కూల్ గానే స్పందిస్తూ వచ్చిన సమంత తన పని తాను చేసుకుంటూ వెళ్ళేది. అయితే ఇటీవల వ్యక్తిగత విషయంపై కొన్ని అనవసర కథనాలను ప్రచారం చేయడం సమంతకు ఏమాత్రం నచ్చలేదట. దీంతో ఆమె కూకట్ పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించారని ఆమె మూడు యూట్యూబ్ ఛానల్స్ పై కూకట్ పల్లి కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు.

 ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై కేసు

ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై కేసు

అందులో 'సుమన్' టివి, 'తెలుగు పాపులర్' టీవీ , 'టాప్ తెలుగు' టీవీ తో పాటు వెంకట్రావు అనే డాక్టర్ కమ్ పొలిటికల్ లీడర్ పై కూడా సమంత కేసు దాఖలు చేశారనీ తెలుస్తోంది. ఆయన సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణాలు ఇవే అంటూ ఆ మీడియా ఛానల్స్ లో విశ్లేషణ ఇవ్వడంపై కూడా సమంత అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇక తన పరువుకు నష్టం కలిగించిన ఏ విషయంలో కూడా సమంత వెనక్కి తగ్గేది లేదని కోర్టుకెక్కినట్లు సమాచారం. ఇక సమంత తరపు న్యాయవాది రాజు ఈ రోజు కోర్టులో వాదనలు వినిపించారు.

Recommended Video

నాకు అఫైర్స్, అబార్షన్స్ అని మాట్లాడుతున్నారు, సమంత ఎమోషనల్ నోట్..! || Filmibeat Telugu
వరుసగా ఆఫర్స్..

వరుసగా ఆఫర్స్..

సమంత ప్రస్తుతం చాలా వరకు సైలెంట్ గా తన పని తానూ చేసుకుంటూ ఎప్పటిలానే సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. నాగ చైతన్య తో ఆమె పెద్దగా వివాదాలకు తావు ఇవ్వకుండా మంచి స్నేహంతోనే విడిపోయినట్లు గా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. అంతేకాకుండా అక్కినేని కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై చాలా పాజిటివ్ గా స్పందించి వారి నిర్ణయాన్ని గౌరవించారు. ఇక సమంత ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది. అలాగే ఆమె ఓటీటీ వెబ్ కంటెంట్ తో బిజీ అవ్వాలనే చూస్తోంది. బాలీవుడ్ నుంచి కూడా సమంతకు మంచి ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X