Samantha 'శాకుంతలం' సినిమాకు కొత్త రిలీజ్ డేట్.. ఏప్రిల్ లో విడుదల.. ఇదైనా పక్కానా?

వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది సమంత. ఫ్యామిలీ మ్యాన్ అనే హిందీ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల యశోద సినిమాతో మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు తాజాగా శాకుంతలం సినిమాతో పాన్ ఇండియాగా వస్తోంది. అయితే ఈ మూవీ విడుదల తేదికి సరిగ్గా ముహుర్తం కుదురుతున్నట్లు అనిపించడం లేదు. ఆది నుంచి పలు వాయిదాలు పడుతూ సామ్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. ఇటీవలే ఫిబ్రవరి 17న మహా శివరాత్రి కానుకగా విడుదల చేస్తామని ప్రకటించిన మూవీ మేకర్స్ తర్వాత వాయిదా వేస్తున్నట్లు వెల్లడించి షాక్ ఇచ్చారు. ఇప్పుడు మరో కొత్త విడుదల తేదిని ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..

శాకుంతలం సినిమాతో..

శాకుంతలం సినిమాతో..

ఏ మాయ చేశావే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ సమంత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఫ్యామిలీ మ్యాన్ 2 వంటి వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు రాగా.. పుష్ప మూవీలోని ఊ అంటావా పాటతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాల తర్వాత సమంతకు బాలీవుడ్, హాలీవుడ్ లోనూ సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇటీవల కాలంలో లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న సమంత యశోద మూవీతో హిట్ కొట్టింది. ఇప్పుడు మరో లేడీ ఒరియెంటెడ్ అండ్ పాన్ ఇండియా చిత్రంగా శాకుంతలం సినిమాతో అలరించడానికి సిద్దంగా ఉంది సమంత. అయితే సమంత శాకుంతలం సినిమాకు వాయిదాల బెడద అంటుకున్న సంగతి తెలిసిందే. .

సామ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..

సామ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..

ఎపిక్ మైథాలాజికల్ మూవీగా వస్తున్న శాకుంతలం సినిమాను ముందుగా గతేడాది నవంబర్ 4న విడుదల చేస్తామన్నారు. అయితే గ్రాఫిక్స్ కారణంగా వాయిదా పడింది. ఇక ఇటీవల ఫిబ్రవరి 17న మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఎట్టకేలకు ప్రకటించారని సామ్ అభిమానులు సంతోషించేలోపే బ్యాడ్ న్యూస్ చెప్పారు. పలు కారణాల వల్ల ఫిబ్రవరి 17న శాకుంతలం విడుదల చేయట్లేదు, త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని దిల్ రాజుతో పాటు గుణశేఖర్ టీమ్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. దీంతో సమంత అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా శాకుంతలం కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించి ఆశ్చర్యపరిచారు మూవీ మేకర్స్.

మారిన రిలీజ్ డేట్..


అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన శాకుంతలం సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. సమ్మర్ కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరి ఈ డేట్ నే ఫిక్స్ అవుతారో.. లేదా మళ్లీ వాయిదా వేసి కొత్త తేది ప్రకటిస్తారో వేచి చూడాలి. ఏప్రిల్ 14న ఈ సినిమాతో పాటు అల్లరి నరేష్ ఉగ్రం, రాఘవ లారెన్స్ రుద్రుడు చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే సమంత సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఓటీటీ హక్కుల కోసం అనేక సంస్థలు పోటీ పడినట్లు తెలుస్తోంది. వాటిలో ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధర వెచ్చించి మరి సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తోంది.

సినిమాల్లోకి అల్లు అర్హ ఎంట్రీ..

సినిమాల్లోకి అల్లు అర్హ ఎంట్రీ..


భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన శాకుంతలం సినిమాకు గుణ శేఖర్ దర్శకత్వం వహించగా మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్, మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్ల, కబీన్ దుహన్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఇక చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించింది. ఈ మూవీతోనే అల్లు అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

 గ్రాఫికల్ వండర్ గా ట్రైలర్..

గ్రాఫికల్ వండర్ గా ట్రైలర్..

ఇక ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ లో వచ్చిన సమంత, దేవ్ మోహన్ ల సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. గ్రాఫిక్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. కళ్లకు ఐఫీస్ట్ ఇచ్చేలా ఉన్నాయి. అలాగే దివంగత నటుడు రెబల్ స్టార్ కనిపించడం బాగుంది. దుర్వాస మహర్షిగా మోహన్ బాబు తన విలక్షణమైన నటనను మరోసారి చూపించనున్నట్లు అర్థమవుతోంది. ఇక ట్రైలర్ చివర్లో చిట్టి భరతుడి పాత్రలో సింహంపై కూర్చుని అల్లు అర్హ ఇచ్చిన ఎంట్రీ సూపర్ హైలెట్ గా నిలవనుంది. మొత్తంగా ట్రైలర్ కనులవిందుగా, ఎమోషనల్ గా, యాక్షన్ తో చాలా అట్రాక్ట్ చేసేలా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X