Samantha Shaakuntalam Trailer: ఆహ్లదకరంగా, కళ్లు చెదిరే గ్రాఫిక్స్.. హైలెట్ గా అల్లు అర్హ ఎంట్రీ!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో బ్యూటిఫుల్ సమంత ఒకరు. ఫ్యామిలీ మ్యాన్ అనే హిందీ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. తర్వాత ఊ అంటావా మావ అనే స్పెషల్ నెంబర్ తో మరింత క్రేజ్ పెంచుకుంది. ప్రస్తుతం లేడి ఒరియెంటెడ్ చిత్రాలతో బిజీగా మారింది ఈ గ్లామరస్ బ్యూటి.

ఇటీవలే యశోద సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సామ్ తాజాగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులో సమంత లుక్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా శాకుంతలం సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

హాలీవుడ్ స్థాయికి..

హాలీవుడ్ స్థాయికి..

బ్యూటిఫుల్ సమంత.. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అందరినీ మాయ చేసింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో జత కట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఫ్యామిలీ మ్యాన్ 2 వంటి వెబ్ సిరీస్ లో నటించి దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఏకంగా హాలీవుడ్ సినిమాలు చేసే రేంజ్ కు వెళ్లిపోయింది సామ్. ప్రస్తుతం లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న సమంత ఇటీవల యశోద మూవీతో అదరగొట్టింది.

మహా శివరాత్రి సందర్భంగా..

మహా శివరాత్రి సందర్భంగా..

అయితే సమంత రూతు ప్రభు నటించిన మరో లేడి ఒరియెంటెడ్ చిత్రం శాకుంతలం. ఎపిక్ మైథాలాజికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా గ్రాఫిక్స్ కారణంగా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇటీవల ప్రకటించి సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ పాన్ ఇండియా సినిమాను ఫ్రిబవరి 17న మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.

ఆహ్లాదకరంగా ప్రేమ, రొమాన్స్..

ఆహ్లాదకరంగా ప్రేమ, రొమాన్స్..

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో శకుంతల పుట్టుక నుంచి దుశ్యంతుడితో పరిచయం, ప్రేమ, రొమాన్స్ చూపించారు. ఈ సన్నివేశాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. అలాగే శకుంతల పడే కష్టాలు, దుశ్యంతుడికి, అసురలకు ఉండే భీకరమైన యుద్ధాన్ని ట్రైలర్ లో చూపించారు.

రంగురంగుల సీతాకోక చిలుకల మధ్య..

రంగురంగుల సీతాకోక చిలుకల మధ్య..

"ఈ భూమి మీద అమ్మా నాన్నలకు అక్కర్లేని తొలి బిడ్డ. మేనక విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా ఈ పాప పుట్టింది" అంటూ వచ్చిన వాయస్ ఓవర్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. తర్వాత "అప్సరస బిడ్డ అయిన అనాథలే మిగిలిందే" అంటూ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. అందమైన, రంగురంగుల సీతాకోక చిలుకల నడుమ మరింత అందంగా సమంత ఎంట్రీ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది. దేవకన్యలా సమంత లుక్స్ కనువిందు చేశాయి.

ఆకట్టుకున్న డైలాగ్ లు..

సమంత, దేవ్ మోహన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. "స్వచ్ఛమైన తన ప్రేమ కోసం దుర్వాసుల వారి ఆగ్రహానికి.. కష్యపు మహర్షుల వారి అనుగ్రహానికి నడుమ ఆమె పడే కష్టాలు భూ మాతకు సైతం భారమే. అయితే కర్మకు ఎవరు అతీతులు కారు", "తండ్రి అయాతి వృద్ధ్యాపాన్ని స్వీకరించి తన యవ్వనాన్నితండ్రి ప్రసాదించిన కొడుకు కురు వంశంలో పుట్టారు. నన్ను వంచించడానికా", "మాయ ప్రేమను మరిపిస్తుందేమో.. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు" అనే డైలాగ్ లో ఆకట్టుకున్నాయి.

హైలెట్ గా అల్లు అర్హ ఎంట్రీ..

హైలెట్ గా అల్లు అర్హ ఎంట్రీ..

ట్రైలర్ లో గ్రాఫిక్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. కళ్లకు ఐఫీస్ట్ ఇచ్చేలా ఉన్నాయి. అలాగే దివంగత నటుడు రెబల్ స్టార్ కనిపించడం బాగుంది. దుర్వాస మహర్షిగా మోహన్ బాబు తన విలక్షణమైన నటనను మరోసారి చూపించనున్నట్లు అర్థమవుతోంది. ఇక ట్రైలర్ చివర్లో చిట్టి భరతుడి పాత్రలో సింహంపై కూర్చుని అల్లు అర్హ ఇచ్చిన ఎంట్రీ సూపర్ హైలెట్ గా నిలవనుంది. మొత్తంగా ట్రైలర్ కనులవిందుగా, ఎమోషనల్ గా, యాక్షన్ తో చాలా అట్రాక్ట్ చేసేలా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X