Samantha: మళ్లీ ఆస్పత్రిలో సమంత.. ముఖానికి మాస్క్ పెట్టుకుని షాకింగ్‌గా.. ఏం జరిగిందంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా స్టార్ డమ్ అందుకుంది ముద్దుగుమ్మ సమంత. మొదట్లో గ్లామర్ ఒలకబోసి యూత్ ను అట్రాక్ట్ చేసిన సమంత ఈ మధ్య కాలంలో మాత్రం మహిళఆ ప్రాధాన్యత చిత్రాలతో అలరిస్తోంది. అయితే అందులో భాగంగానే ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.

కానీ సమంత క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే తాజాగా సమంత మళ్లీ హాస్పిటల్ లో చేరిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అందుకు కారణం సమంత తాజాగా పోస్ట్ చేసిన పిక్. ఆ ఫొటో వివరాల్లోకి వెళితే..

Samantha In Hospital With Mask And Taking Hyperbaric Therapy

నిన్ను కలిశాక: బ్యూటిఫుల్ సమంత నిన్ను కలిశాక అనే సినిమాకు మొదట ఆడిషన్ ఇచ్చిన రెమ్యునరేషన్ ఎక్కువగా అడగడంతో మేకర్స్ నిరాకరించారు. దీంతో గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్టెడ్ మూవీ ఏ మాయ చేశావేతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా డెబ్యూ చేసింది. తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ అందుకున్న సామ్ తర్వాత అనేక మంది అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

Samantha In Hospital With Mask And Taking Hyperbaric Therapy

సినిమాపై నెగెటివిటీ: ప్రస్తుతం వరుసగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న సమంత ఇటీవల శాకుతంలంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ 14న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంటోంది. ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలోని గ్రాఫికల్ విజువల్స్ పై నెగెటివిటీ వస్తోంది.

Samantha In Hospital With Mask And Taking Hyperbaric Therapy

అమెజాన్ ప్రైమ్ లో: శాకుంతలం సినిమా పరిస్థితి ఎలా ఉన్నా సమంతకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీసులో నటించేందుకు సిద్ధంగా ఉంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా లీడ్ రోల్ చేసిన ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో సమంత యాక్ట్ చేస్తోంది. ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా సమంత లండన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.

Samantha In Hospital With Mask And Taking Hyperbaric Therapy

సమంత విగ్రహంతో: ఇక స్టార్ హీరోయిన్ సమంతకు ఫ్యాన్స్ ఎక్కువే. వారిలో వీరాభిమాని ఒకరు సమంతకు ఏంకగా గుడి కట్టి అభిమానం చాటుకుంటున్నాడు. ఆలపాడులోని తన ఇంట్లోనే సమంత విగ్రహంతో టెంపుల్ నిర్మిస్తున్నాడు. దాన్ని ఏప్రిల్ 28న సామ్ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా సమంత కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

ముఖానికి మాస్క్: ఇదివరకు మయోసైటిస్ తో బాధపడుతున్న సామ్ ట్రీట్ మెంట్ తీసుకుంటూనే సినిమాల్లో నటించింది. బౌన్స్ బ్యాక్ అయిన సమంత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే తాజాగా ముఖానికి మాస్క్ పెట్టుకున్న సమంత ఫొటో షాక్ కు గురి చేసింది. ఈ ఫొటో సమంత ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లుగా ఉంది.

Samantha In Hospital With Mask And Taking Hyperbaric Therapy

హైపర్ బారిక్ థెరపీ: సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేసిన ఫొటో క్షణాల్లో వైరల్ కాగా.. ధైర్యంగా ఉండాలని ఫ్యాన్స్, నెటిజన్లు, ప్రేక్షకులు సపోర్ట్ చేస్తున్నారు. అయితే హైపర్ బారిక్ థెరపీని తీసుకుంటున్నట్లుగా సామ్ తెలిపింది. పలు వ్యాధులకు ఈ థెరపీ చక్కగా పని చేస్తుందని, శరీరంలో డ్యామెజింగ్ టిష్యూలు ఈ థెరపీ కారణంగా బాగుపడతాయంటూ సమంత గూగుల్ సెర్చ్ ఫొటో షేర్ చేసి పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X