Samantha: విజయ్ దేవరకొండపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. హిట్లు ప్లాపులు అంటూ తేడా లేకుండా ఏదో ఒక చిత్రం చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇటీవల ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న సమంత శాకుతంలంతో మాత్రం డిజాస్టర్ అందుకుంది. ఇప్పుడు ఎలాగైన హిట్ కొట్టాలని కొత్త సినిమాతో బిజీగా మారింది. ఇదిలా ఉంటే షూటింగ్ లో భాగంగా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటి తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
యశోద సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సౌత్ స్టార్ హీరోయిన్ సమంత శాకుంతలం మూవీ మాత్రం నిరాశపరిచింది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీపై ప్రేక్షకులు పెదవి విరిచారు. గ్రాఫిక్స్, స్టోరీ, సంగీతం, బీజీఎమ్ లపై నెగెటివ్ కామెంట్స్ చేశారు.

అయినా ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుని సత్తా చాటింది. కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో శాకుంతలం ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులు సాధించింది. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ క్యాటగిరీల్లో అవార్డ్స్ కొల్లగొట్టింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెడుతోంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో సమంత ప్రధాన పాత్ర పోషించనుంది. ఇదే కాకుండా చెన్నై స్టోరీ అనే మూవీ కూడా చేస్తున్నట్లు టాక్. కానీ ఇందులో సామ్ ను తొలగించిన శ్రీలీలకు స్థానం ఇచ్చారని మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఇక సమంత తెలుగులో చేస్తున్న మూవీ ఖుషీ. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన సామ్ నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఖుషీ సినిమా చిత్రీకరణలో భాగంగా సమంత, విజయ్ దేవరకొండ టర్కీకి వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే విజయ్, సామ్ కలిసి టర్కీలో పలు ప్రదేశాలను చుట్టి వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండతో రెస్టారెంట్ లో దిగిన ఫొటో షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యుల చేసింది సామ్.
"నీ బెస్ట్ చూశాను. వరస్ట్ చూశాను. చివరిగా రావడం, మొదటగా వచ్చేయడం, నీ హెచ్చుతగ్గులు అన్నీ చూశాను. నాకోసం నిలబడ్డ ఒక మంచి స్నేహితుడు. ఎంత గొప్ప సంవత్సరం ఇది" అని రాసుకొచ్చింది సమంత. ఈ పోస్ట్ వైరల్ కాగా నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











