అందుకే సమంతతో నాగచైతన్య విడాకులు.. మేనత్త నాగ సుశీల క్లారిటీ
తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ జనరేషన్‌లో స్టార్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు అక్కినేని నాగచైతన్య, సమంత రూత్ ప్రభు. ఏమాయ చేశావే సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇద్దరి మతాలు, కులాలు, ప్రాంతాలు వేరైనా పెద్దలు వీరి పెళ్లిని అంగీకరించారు. కానీ అనూహ్యంగా పెళ్లయిన కొద్దికాలానికే ఈ జంట విడిపోవడం తెలుగు చిత్ర పరిశ్రమను, అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సమంత - చైతూ ఎందుకు? ఏ కారణం చేత విడిపోయారన్నది ఇప్పటికీ పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. దీనిపై ఎప్పటికప్పుడు సరికొత్త వాదనలు వినిపిస్తుంటాయి. తాజాగా వీరిద్దరి వ్యవహారంపై అక్కినేని నాగార్జున సోదరి, నాగచైతన్యకు స్వయానా మేనత్త అయిన నాగసుశీల స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..
సీక్రెట్‌గా ప్రేమాయణం
క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేశావే సినిమాలో తొలిసారి కలుసుకున్నారు నాగచైతన్య - సమంత. జెస్సీ ప్రేమలో పడిపోయిన చైతన్య కొన్నాళ్లు సీక్రెట్‌గా డేటింగ్ చేశారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో పెద్ద ఎత్తున గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే సమంత కానీ, నాగచైతన్య కానీ ఈ వార్తలను ఖండించలేదు. ఈ దశలో అనూహ్యంగా తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని వీరిద్దరూ బాంబు పేల్చడంతో ఇండస్ట్రీ జనాలు, అభిమానులు ఉలిక్కిపడ్డారు.

ఘనంగా సమంత- నాగచైతన్యల పెళ్లి
పెద్దల అంగీకారంతో గోవాలో సమంత - నాగచైతన్యలు ఒక్కటయ్యారు. వీరి వివాహం .. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాలలో నటించారు. ఇద్దరూ వీడిగా ఒకే ఫ్లాట్‌లో కాపురం పెట్టి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేశారు. ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్స్, కుటుంబంలో జరిగే శుభకార్యాలకు కలిసి హాజరవుతూ సందడి చేసేవారు. ఇలాంటి దశలో సమంత - నాగచైతన్యల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకుంటున్నాయని, త్వరలోనే విడిపోతున్నారని గాసిప్స్ వచ్చాయి.
విడాకులతో షాకిచ్చిన చై, సామ్
వీటిని సినీజనాలు, అభిమానులు కొట్టిపడేశారు. అయితే తన సోషల్ మీడియా ఖాతాలలో పేరుకు ముందు అక్కినేనిని తొలగించడం, నాగచైతన్యను అన్‌ఫాలో కావడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. ఆ తర్వాత కొద్దిరోజులకే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలోని తమ పెళ్లి ఫోటోలు, నాగచైతన్యతో కలిసున్న ఫోటోలు, వీడియోలను సమంత డిలీట్ చేయడంతో వీరిద్దరూ విడిపోతున్నట్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. అనంతరం ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకోవడం, న్యాయస్థానం విడాకులు మంజూరు చేయడంతో సమంత- నాగచైతన్యలు అధికారికంగా విడిపోయారు.
శోభితను పెళ్లాడిన చైతూ
సమంతతో విడాకుల తర్వాత కొన్నాళ్లు ఒంటరిగానే లైఫ్ లీడ్ చేసిన నాగచైతన్య ఆ తర్వాత మరో హీరోయిన్ శోభిత ధూళిపాళను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నారు. అటు సమంత కూడా రెండో పెళ్లి ప్రయత్నాల్లోనే ఉన్నారని.. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఒకే ఫ్లైట్‌లో కలిసి వెళ్లడం, వెకేషన్స్, రెస్టారెంట్స్‌లలో చక్కర్లు కొడుతుండటంతో త్వరలోనే రాజ్- సమంతలు గుడ్ న్యూస్ చెబుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
విడాకులపై నాగసుశీల స్పందన
అయితే సమంత- నాగచైతన్య విడిపోవడంపై ఇరు కుటుంబాలు, సన్నిహితులు ఎవరూ నేటి వరకు స్పందించలేదు. తాజాగా అక్కినేని నాగార్జున సోదరి, నాగచైతన్యకు స్వయానా మేనత్త అయిన నాగ సుశీల స్పందించారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాగార్జున, నాగచైతన్య, సుమంత్‌లు స్వతహాగా నటులు.. అందుకే వారున్న రంగంలోని వ్యక్తినే పెళ్లాడారు. అలాంటప్పుడు వారి ఫీల్డ్‌ని అర్ధం చేసుకుంటారని, కానీ చైతన్యకు అలా జరిగింది. ఇందులో మరొకరిని నిందించడానికి ఏం లేదని.. ఏం జరిగినా భార్యాభర్తలే కారణం. భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకుని, సర్దుకుపోవాలి. కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వస్తే ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా విడిపోవడమే మంచిది.
కొట్టుకుంటూ కలిసుండొద్దు
సమాజం కోసమో, ఫ్యామిలీ పరువు కోసమని స్ట్రగుల్ అవుతూ కలిసుండాల్సిన అవసరం ఈరోజుల్లో లేదు. ఉన్నది ఒక్కటే జీవితం.. విడిపోయి జీవితంలో ముందడుగు వేస్తే ఇద్దరూ స్నేహితులుగా మిగిలిపోవచ్చు. అలాంటి వారిని ఎంతోమందిని చూశా.. కానీ కొన్ని జంటలు మాత్రం ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు' అని నాగసుశీల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











