నాగచైతన్యను అలా వదిలించుకున్న సమంత.. ప్రముఖ జ్యోతిష్యుడి షాకింగ్ కామెంట్స్
విడిపోయి 4 ఏళ్లు కావొస్తున్నా అక్కినేని నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు విడాకుల వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ దుమారం రేపుతూనే ఉంది. శోభిత ధూళిపాళతో చైతన్య రెండో పెళ్లి, దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ రూమర్స్, సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అసభ్య వ్యాఖ్యలతో నాగచైతన్య - సమంతల విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా వీరిద్దరి విడాకుల వ్యవహారంపై ప్రముఖ జ్యోతిష్యుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
సీక్రెట్‌గా ప్రేమాయణం
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేశావే సినిమాలో కలిసి నటించిన సమంత - నాగచైతన్యలు ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడి కొన్నేళ్లపాటు డేటింగ్ చేశారు. ఈ సినిమాలో నటనతో సమంత తెలుగువారిని మాయ చేసి.. టాలీవుడ్‌లో గట్టిగా జెండా పాతి తర్వాత టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. చైతూ- సమంతల ప్రేమాయణంపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చినప్పటికీ ఇద్దరూ ఖండించలేదు. అయితే 2017లో పుకార్లకు చెక్ పెడుతూ సమంత- నాగచైతన్యలు తాము రిలేషన్‌లో ఉన్నామని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేసి షాకిచ్చారు.

విడాకులతో షాకిచ్చిన చైతూ- సామ్
అనంతరం గోవాలో సమంత - నాగచైతన్యల వివాహం .. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ సినిమాలలో బిజీగానే గడిపారు. వైహహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ స్టార్ కపుల్ అనిపించుకున్నారు. రేపో మాపో గుడ్‌న్యూస్ చెబుతారని అభిమానులు అనుకుంటున్న సమయంలో తన పేరు అక్కినేని ఇంటి పేరుని, నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించారు. దీంతో సమంత - నాగచైతన్యల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నట్లుగా గాసిప్స్ వచ్చాయి. వీటిని నిజం చేస్తూ ఈ జంట పరస్పర అంగీకారంతో విడిపోవడం టాలీవుడ్ వర్గాలను షాక్‌కు గురిచేసింది.
శోభితో చైతన్య రెండో పెళ్లి
సమంతతో విడాకుల తర్వాత మరో హీరోయిన్ శోభిత ధూళిపాళను నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుని ప్రస్తుతం జీవితం ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సమంత- నాగచైతన్య ఎందుకు విడిపోయారు? ఏ బలమైన కారణం వీరి మధ్య విడాకులకు కారణమైంది? అంటూ అభిమానులు, సినీ వర్గాలు జుట్టు పీక్కొంటూనే ఉన్నాయి. తాజాగా సామ్- చైతూ పెళ్లి, విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్‌వీ నాగనాథ్. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.
సమంత సానుభూతి ప్రయత్నాలు
సమంత వ్యక్తిగత జీవితంపై విశ్లేషణ చేస్తే చాలా మందికి నచ్చదని ఆయన వ్యాఖ్యానించారు. విడాకులు తీసుకున్న తర్వాత జనం నుంచి సానుభూతి కొట్టేయడానికి పలు వేదికలపై దొంగ ఏడుపులు ఏడ్చిందని నాగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ ఏడుపులతోనే చైతన్యను వదిలించుకుందని, దీంతో చైతూ ఎంతో ఆవేదన చెంది ఉంటారని పేర్కొన్నారు. సమంతకు ఎమోషనల్ మెచ్యూరిటీ లేదని ఈ విషయంలో ఆమె అభిమానులు నన్ను తిట్టుకున్నా పర్లేదని నాగనాథ్ మండిపడ్డారు. గతంలోనే నాగచైతన్యను ఇలాగే బెదిరించి పెళ్లి చేసుకుందని నాగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంత కష్టపడి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాగనాథ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతుండగా.. సమంత అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు.


Click it and Unblock the Notifications











