For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంత - నాగచైతన్య లిప్ లాక్ ఫొటోస్ వైరల్.. విడాకులు రూమర్ల వేళ అలాంటి కామెంట్లు

  |

  మొన్నటి వరకు టాలీవుడ్లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తం లో బెస్ట్ స్టార్ కపుల్స్ గా గుర్తింపు అందుకున్న వారిలో సమంత నాగ చైతన్య టాప్ ప్లేస్ లో ఉన్నారు అనే అని చెప్పాలి. వీరిని చూస్తే చాలా ముచ్చటగా ఉంటుందని ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు పాజిటివ్ గా కామెంట్ చేశారు. సమంత నాగచైతన్య ఎప్పటికి అదే ప్రేమతో కొనసాగాలని ఎంతోమంది కూడా వారిని ఆశీర్వదించారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు కథనాలు అయితే గట్టిగానే వస్తున్నాయి.

  ఈ క్రమంలో అభిమానుల్లో కొంత కన్ఫ్యూజన్ తో పాటు ఆందోళన కూడా నెలకొంది. ఒక విధంగా మీడియాలో వార్తలు చూసి ఎంతో మంది అభిమానులు బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తేనే అర్ధమవుతోంది. ప్రస్తుతం వారికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.

  ఒకరికొకరు తోడుగా ఉంటూ..

  ఒకరికొకరు తోడుగా ఉంటూ..

  సమంత నాగచైతన్య ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలాగా ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎలాంటి సినిమా ఈవెంట్స్ లో కనిపించినా కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటారు. సమంత నాగచైతన్య అలా నడుచుకుంటూ వస్తుంటే కెమెరాలన్ని కూడా వారి వైపు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాయి. సమంత చైతు ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరు తోడుగా ఉంటూ కనిపించారు. అయితే ప్రస్తుతం ఇక వారు కొన్ని కారణాల వలన విడిపోయే అవకాశం ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

  పెద్దల ప్రయత్నం..

  పెద్దల ప్రయత్నం..

  ఇటీవల విడాకులు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఒక డేట్ ను కూడా డిసైడ్ చేసుకున్నట్లు నేషనల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సమంత నాగ చైతన్య బెస్ట్ సౌత్ ఇండియన్ స్టార్ కపుల్స్ అని అందరికి తెలిసిందే. ఇక మొదటిసారి వాళ్ళు విడాకులు అంశంతో మరింత హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. కొంతమంది ప్రముఖులు వారి మధ్యలో మంచి సంబంధాన్ని బలపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వస్తుంది.

  ఒక సినిమాతో మొదలైన ప్రయాణం

  ఒక సినిమాతో మొదలైన ప్రయాణం

  ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే సమంత నాగచైతన్య ఇద్దరూ అభిమానులకు నచ్చడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా ఏ మాయ చేసావే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఒక విధంగా నాగచైతన్య మొదటి సినిమా జోష్ తర్వాత వచ్చిన ఏ మాయ చేసావే సినిమా అతనికి మొదటి సక్సెస్ ను ఇచ్చింది. సమంత కూడా ఆ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇక ఆ తర్వాత ఇద్దరి కెరీర్ కూడా ఒక్కసారిగా ఊపందుకుంది.

  మొదటి సినిమాలోనే ఎక్కువ లిప్ లాక్స్..

  మొదటి సినిమాలోనే ఎక్కువ లిప్ లాక్స్..

  ఏ మాయ చేసావే సినిమా లో సమంత నాగచైతన్య మధ్యలో ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ కథను తమిళ్ హిందీలో కూడా రీమేక్ చేసినప్పటికీ ఎక్కువగా హైలెట్ అయ్యింది మాత్రం తెలుగులో అనే చెప్పాలి. మిగతా స్టార్స్ ఎవరు కూడా చైతూ సమంత తరహాలో రొమాంటిక్ ఫీల్ ను కలిగించలేదని కామెంట్స్ కూడా గట్టిగానే వచ్చాయి. ముఖ్యంగా సినిమాలో లిప్ లాక్స్ అయితే చాలానే ఉన్నాయి.

  మనంలో కూడా

  మనంలో కూడా

  ఏ మాయ చేసావే సినిమా తర్వాత సమంత నాగ చైతన్య మరో మూడు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు వారు చేసిన ఆటోనగర్ సూర్య అంతగా సక్సెస్ అవ్వలేదు ఇక ఆ తర్వాత చేసిన మనం, మజిలీ సినిమాలు మాత్రం అక్కినేని కుటుంబానికి ఒక మంచి మరిచిపోలేని విజయాన్ని అందించింది. మనం సినిమాలో సమంత నాగ చైతన్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది.

  అందులో కూడా ఇద్దరు లిప్ లాక్ సీన్ లో అలాగే రొమాంటిక్ సన్నివేశాల్లో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక మజిలీ సినిమా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం సమంత. ఆ సినిమా కథపై మొదటి నుంచి కూడా దర్శకుడితో కూర్చున్నదే ఆమెనే. వరుస అపజయాల్లో ఉన్న చైతన్యకు ఆ సినిమా ద్వారానే మంచి బాక్సాఫీస్ హోదా ఏర్పడింది.

   పెళ్లిలో ఫొటోలు కూడా

  పెళ్లిలో ఫొటోలు కూడా

  సినిమాల్లోనే కాకుండా ప్రత్యేకంగా ఫోటోషూట్స్ లో కూడా సమంత నాగచైతన్య రొమాంటిక్ గా ఎక్కువగా కనిపించేవారు. ఎక్కడికైనా హాలిడేస్ కి వెళ్ళినప్పుడు కూడా సమంత నాగచైతన్య ప్రేమగా ముద్దాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో చాలానే షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన లిప్ లాక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

  Mayawati పై Randeep Hooda జోక్, #ArrestRandeelHooda అంటూ డిమాండ్ || Filmibeat Telugu
  ఆ క్షణాలను మరోసారి గుర్తు చేసుకుంటే..

  ఆ క్షణాలను మరోసారి గుర్తు చేసుకుంటే..

  నాగచైతన్య నటించిన లవ్ స్టొరీ సినిమా ఇటీవల విడుదల కాగా ఆ సినిమాకు సంబంధించిన హడావుడిలో ఎక్కడ కూడా సమంత కనిపించకపోవడంతో అనుమానాలు అంతకంతకు ఏక్కువవుతున్నాయి. ఇక విడాకులకు సంబంధించిన వార్తలు ఎక్కుతున్న క్రమంలోనే పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  ఈ క్షణాలు మరొకసారి గుర్తు చేసుకుంటే ఎలాంటి విభేదాలు ఉండదేమో అని ఫ్యాన్స్ సలహాలు కూడా ఇస్తున్నారు. నాగ చైతన్య ఇద్దరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా సెలబ్రిటీ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా లిప్ లాక్ ఫోటోలు అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మరి సమంత నాగచైతన్య అభిమానులకు ఈ విషయంలో వివరణ ఇస్తారో చూడాలి.

  English summary
  Samantha naga chaitanya lip kiss photos viral in divorce topic
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X