‘మజిలీ’ ఫస్ట్ లుక్ వచ్చేసింది: అంచనాలు పెంచిన సమంత-చైతన్య
టాలీవుడ్ కపుల్ సమంత, నాగ చైతన్య పెళ్ళి తర్వాత తొలిసారి కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'మజిలీ' అనే టైటిల్ ఖరు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఏ మాయ చేశావే, మనం, ఆటో నగర్ సూర్య తర్వాత వీరి కాంబినేషన్‌లో ఇది నాలుగో సినిమా.
ఈ సినిమా కథ విశాఖపట్నం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో వాల్తేరు గ్రౌండ్స్ అనే బోర్డు కనిపించడం బట్టి.... ఈ గ్రౌండ్‌కు, వీరి ప్రేమ కథకు ఏదో లింక్ ఉందనే హింట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు.

ఫస్ట్ లుక్
ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే... ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను 80స్, 90స్‌లోకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో మాజీ క్రికెటర్‌గా నాగచైతన్య, రైల్వే ఉద్యోగినిగా సమంత కనిపిచంబోతున్నారని సమాచారం.

అంచనాలు పెంచిన సమంత, చైతూ
'నిన్నుకోరి ' ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ‘మజిలీ' రొమాంటిక్ డ్రామా బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతోంది. పెళ్లి తర్వాత సమంత, చైతన్య కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మరో హీరోయిన్ కూడా...
సమంత ఫస్ట్ హీరోయిన్ కాగా, దివ్యాన్ష కౌశిక్ సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తణికెళ్ళ భరణి, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, రవిప్రకాశ్, కరణ్, రాజశ్రీ నాయర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. 2019 ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శివ నిర్వాన
నిర్మాతలు: సాహు గరపాటి, హరీష్ పెద్ది
నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఎడిటర్: ప‌్రవీణ్ పూడి
యాక్షన్: వెంకట్


Click it and Unblock the Notifications











