సమంత, నాగచైతన్య 'మజిలీ' షూటింగ్ కంప్లీట్!
రియల్ లైఫ్ కపుల్స్ అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం తర్వాత జంటగా నటిస్తున్న తొలి చిత్రం మజిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సమంత, చైతు భార్య భర్తలుగా నటిస్తున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్ కూడా ఎమోషనల్ గా ఉంటూ ఆకట్టుకుంది. నాగచైతన్య పాత్రలో పలు వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. సమంత భర్తని ప్రేమించే మహిళగా నటిస్తోంది. కాగా ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత సోషల్ మీడియాలో దర్శకుడు శివ నిర్వాణ, నాగచైతన్య, ఇతర చిత్ర యూనిట్ ఉన్న గ్రూప్ ఫోటోని షేర్ చేసింది.

మజిలీ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో నటించడం ఒక గొప్ప అనుభూతి అని సమంత ట్వీట్ చేసింది. పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గోపిసుందర్ ఈచిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











