విడాకులు అయిపోయినా.. ఆ విషయంలో మాత్రం ఉమ్మడిగానే చై-సామ్.. ఏం జరగబోతోంది?
అక్కినేని నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్గా నడుస్తూనే ఉంది. వీరు విడాకులు ప్రకటించి మూడు నెలలు గడుస్తున్నా ఈ విడాకుల వ్యవహారం గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. అయితే తాజాగా వచ్చిన ఒక విషయం మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే..

ఇళ్లల్లో ఒప్పించి
ఏం మాయ చేసావే సినిమాలో మొట్ట మొదటి సారి అక్కినేని నాగ చైతన్య, సమంత ఇద్దరూ కలిసి నటించారు. సమంత కు ఇది మొదటి సినిమా కాగా అక్కినేని నాగచైతన్య మాత్రం ఇది రెండో సినిమా. అయితే సినిమా చేసినప్పుడు మొదలైన పరిచయం ఆ తర్వాత చాలా రోజులకు ప్రేమగా మారింది. వీరి ప్రేమ వివాహ బంధం వరకు నడవడానికి చాలా సమయమే పట్టింది. వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఇద్దరి ఇళ్లల్లో చెప్పి ఒప్పించి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు.

పద్ధతైన పాత్రలు చేస్తూ
వివాహం జరిగిన తర్వాత సమంత చాలా వరకు పద్ధతైన పాత్రలు చేస్తూ వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమకు అక్కినేని కుటుంబం గురించి బాగా తెలియడంతో ఆమెకు కాస్త బోల్డ్ తరహా పాత్రలు ఇవ్వడానికి ఎవరూ సాహసించ లేదు. అందుకే ఆమె ఎక్కువగా లేడీ సెంట్రిక్ సినిమాలు చేస్తూ కాలం వెళ్లదీస్తూ వచ్చింది. ఒకరకంగా రంగస్థలం సినిమాలో ఆమె నటించడం కూడా అక్కినేని కుటుంబానికి నచ్చలేదు అని భావిస్తూ ఉంటారు. కానీ బయటకు మాత్రం వారెవరూ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు.

దూరం పెరిగి
అయితే ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో సమంత రెచ్చిపోయి నటించడంతో ఆ కుటుంబానికి మధ్య దూరం పెరిగింది అని భావిస్తున్నారు. అదే దిశగా నాగచైతన్య సమంత విడాకులు కూడా జరిగిపోయాయి. అక్టోబర్ నెలలో వీరిద్దరు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు అయితే సమంతా వేరే వాళ్ళతో వివాహేతర సంబంధాలు పెట్టుకుందని నాగచైతన్య అభిమానులు పెద్ద ఎత్తున ఆమెను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దాడి చేశారు. అవన్నీ భరిస్తూ వచ్చిన ఆమె అది నిజం కాదని క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది.

ప్రచారాలు మాత్రం చాలా రకాలుగా
అసలు కారణాలు ఏమున్నాయో వాళ్ళిద్దరూ నోరు విప్పితే బయటకు రావు కానీ ప్రచారాలు మాత్రం చాలా రకాలుగా జరుగుతూ వచ్చాయి. అయితే దాదాపుగా వారిద్దరూ ఇప్పుడు అధికారికంగా విడిపోయినట్లే. కానీ వారిద్దరూ కలిసి వివాహబంధం లో ఉన్న సమయంలో కొన్ని ఎడ్వర్టైజ్మెంట్స్ లో నటించారు. ఇద్దరూ ఆ ఎడ్వర్టైజ్మెంట్స్ లో కూడా భార్య భర్తలు గాని కనిపించారు. కొన్ని దుస్తుల బ్రాండ్స్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ లో వీరు కనిపించారు. కాగా వాటికి సంబంధించిన డేట్లు పూర్తి కావడంతో ఆ విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు.

సందిగ్ధత కొనసాగుతూ
కానీ కోల్గేట్ టూత్ పేస్ట్ విషయంలో వీరిద్దరూ కలిసి బ్రాండ్ కు సంతకాలు చేశారు. కోల్గేట్ సాల్ట్ అనే ప్రొడక్ట్ కు సమంత ప్రమోటర్ గా వ్యవహరిస్తుండగా కోల్గేట్ మాక్స్ ఫ్రెష్ కు నాగచైతన్య ప్రమోటర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి ఈ అడ్వర్టైజ్మెంట్లు చేశారు ఇప్పుడు వీరిద్దరు విడిపోయిన క్రమంలో వాటి పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇద్దరూ కలిసి ఈ జాయింట్ వెంచర్ లో విడాకుల తర్వాత కూడా కొనసాగుతారా లేక ఒకరు తప్పుకుని మరొకరు కొనసాగుతారా అనే అంశం మీద సందిగ్ధత కొనసాగుతోంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.


Click it and Unblock the Notifications











