Don't Miss!
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్నేహితురాలికి కరోనా పాజిటివ్.. మూడు రోజుల క్రితం ముద్దుపెట్టిన సమంత!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కరోనా మహమ్మారి రాకుండా ఉండేందుకు సినీ తారలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఊహించని విధంగా ఎక్కడో ఒక చోట కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య షాక్ కి గురి చేస్తోంది. ఇక ఇటీవల సమంత తన స్నేహితురాలితో ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేయడంతో ఆడియెన్స్ ని షాక్ కి గురి చేసింది. ఎందుకంటే రీసెంట్ గా ఆ యువతికి కరోనా టెస్ట్ లో పాజిటివ్ అని తేలింది.
స్నేహితురాలికి కరోనా పాజిటివ్..
సమంత లాక్ డౌన్ తరువాత షూటింగ్స్ లో పాల్గొనడం లేదు గాని రెగ్యులర్ గా తన స్నేహితులతో టచ్ లో ఉంటోంది. ఇక ఆరోగ్యం విషయంలో కూడా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఇటీవల ఆమె స్నేహితురాలికి కరోనా పాజిటివ్ అని తెలడంతో మీడియాలో ఆ న్యూస్ వైరల్ గా మారింది.
పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్..
ఆ స్నేహితురాలు మరెవరో కాదు..ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి. గత కొంత కాలంగా పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ గా ఉంటున్న శిల్పా రెడ్డి అంటే సమంతకు చాలా ఇష్టం. వీరిద్దరు ఎంత క్లోజ్ అంటే.. సమంతకు ఏ మాత్రం గ్యాప్ దొరికినా రెగ్యులర్ గా కలుసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల శిల్పా రెడ్డి కరోనా భారిన పడటం షాక్ కి గురి చేసింది.
View this post on Instagram❤️ @shilpareddy.official God bless 🤗#foreverandalways
A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on
ముద్దుపెట్టిన సమంత
శిల్పా రెడ్డికు సమంత ముద్దులు పెట్టిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ రీసెంట్ గా దిగినవేనా లేక సమంత చాలా రోజుల తరువాత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిందా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సమంత శిల్పా రెడ్డిని హాగ్ చేసుకొని మరి కిస్ ఇవ్వడం కాస్త ఆందోళనను కలిగిస్తోంది.
Recommended Video
సమంత నాగచైతన్య ఒకే ఇంట్లో..
ఎప్పుడు ఎలా వస్తుందో తెలియని కరోనా వైరస్ ఎలాంటి వారికైనా సోకే ప్రమాదం ఉంది. ఇక సమంత ఈ విషయంలో అభిమానులకు వీలైనంత త్వరగా ఒక క్లారిటీ ఇస్తే బావుంటుందని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత నాగచైతన్య ప్రస్తుతం ఒక ఫ్లాట్ లో కలిసే ఉంటున్నారు.