Venu Swamy: సమంత రెండో పెళ్లిపై వేణుస్వామి కామెంట్స్.. ఇంతకీ ఏమన్నారంటే?

Samantha - Raj Nidimoru: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్ర‌భు మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరుతో ఆమె సోమవారం వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ జంట తమిళనాడులోని ఈషా ఫౌండేషన్ యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో భూతశుద్ధి సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. సమంత-రాజ్ నిడిమోరు పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో పూర్తిగా ప్రైవేట్‌గా జరిగింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ వివాహం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహరంపై తాజాగా జ్యోతిష్యుడు వేణుస్వామి కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏమన్నారు ?

హీరోయిన్ సమంత-రాజ్ నిడుమోరును పెళ్లి చేసుకున్న విషయం అధికారికంగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సమంత స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ జంటకు సోషల్ మీడియా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె మొదటి వివాహం, గత రిలేషన్‌షిప్స్ గురించి సోషల్ మీడియాలో కొత్తగా చర్చలు మొదలయ్యాయి. అభిమానులు, నెటిజన్లు, సినిమా వర్గాలు ఆమె కొత్త జీవితంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పలువురు జ్యోతిష్యులు కూడా తమ అంచనాలు, అబిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Samantha-Raj Nidimoru Marriage

తాజాగా ఈ వివాహంపై జ్యోతిష్యుడు వేణుస్వామి స్పందించారు. దీంతో వేణు స్వామి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ప్రస్తుతం జ్యోతిష్యుడు వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో సమంత-నాగచైతన్య వివాహం, విడాకులపై వేణుస్వామి చేసిన ప్రకటనలు పెద్ద వివాదాన్నే తెచ్చిపెట్టాయి. ఆ సమయంలో తన అంచనాలు ప్రేక్షకుల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు సమంత రెండో పెళ్లి వార్తల తరువాత మరలా ఆయన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

జ్యోతిష్యుడు వేణుస్వామి వీడియోలో మాట్లాడుతూ.. ఉదయం నుంచి నాకు ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సమంత రెండో పెళ్లి చేసుకుంది. కాబట్టి, ఆమె జీవితం ఎలా ఉండబోతోంది?' అని అడుగుతున్నారు" అని చెప్పారు. అంతేకాదు, తాను ఎవరిమీద వ్యాఖ్యలు చేయాలని అనుకోవడం లేదని, ఎవరి వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోకుండా "నా పని నేను చేసుకుంటూ వెళ్తాను" అని స్పష్టం చేశారు. ఈ వీడియో పబ్లిక్‌లోకి రాగానే నెటిజన్ల కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది సమంత వ్యక్తిగత జీవితం ఆమె హక్కు అని, ఇలాంటి జ్యోతిష్య వ్యాఖ్యలు అవసరం లేదని మండిపడ్డారు. మరికొందరు మాత్రం జ్యోతిష్యుడి గత అంచనాలు నిజమయ్యాయంటూ ఆయనను సమర్థించారు.

సమంత అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో "ఆమె గతం ముగిసింది, ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది", "ఆమె సంతోషంగా ఉండటం ముఖ్యం" అంటూ సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత- రాజ్ నిడుమోరు పెళ్లి మాత్రమే కాదు, దానిపై వచ్చే ప్రతీ స్పందన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X