చైతును ముద్దాడిన సాయి పల్లవి.. ఆ షాట్ మైండ్‌లోనే ఉంటుంది.. సమంత రియాక్షన్
నాగ చైతన్య-సమంత ఏ మాయ చేశావో చిత్రం నుంచి వెండితెరపై నిజంగానే మాయ చేస్తూ వస్తున్నారు. నాగ చైతన్య- సమంత (చైసామ్) కలిసిన ప్రతీసారి సిల్వర్ స్క్రీన్‌పై ఏదో మ్యాజిక్ పుడుతూనే ఉంటుంది. మనం, మజిలీ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. రీల్ లైఫ్‌లో ప్రేమ వ్యవహారం నడిపించడమే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ప్రేమించుకుని ఒక్కటయ్యారు. సోషల్ మీడియాలో వీరిద్దరి జంట గురించి వచ్చినన్ని కామెంట్స్ మరే ఇతర సెలెబ్రిటీ జంటకు రావు.

అందరూ మెచ్చిన జంట..
నాగ చైతన్య- సమంత జంటకు అభిమానుల్లోనే కాదు సెలెబ్రిటిల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. వీరి జంటకు సోషల్ మీడియాలో మంచి మార్కులే పడుతుంటాయి. చైతన్యను సమంత ఆట పట్టించడం, వీరిద్దరి ఆన్యోన్యతకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇద్దరూ బిజీగానే..
పెళ్లయ్యాక కలిసి చేసిన చిత్రం మజిలీ. ఈ సినిమా ఇద్దరి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఇద్దరూ తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. సమంత గతవారమే జానుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ చైతన్య తన లవ్ స్టోరీని చెప్పేందుకు కూడా రెడీ అవుతున్నాడు.
ప్రేమికుల రోజు సందర్భంగా..
వాలెంటైన్స్ డే కానుకగా లవ్ స్టోరీ చిత్రం నుంచి ఏ పిల్లా మ్యూజికల్ ప్రివ్యూ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ ప్రోమోలో సాయి పల్లవి, నాగ చైతన్య రొమాన్స్ అదిరిపోయేట్టు కనిపిస్తోంది. చివర్లో సాయి పల్లవి పెట్టిన ముద్దుకు నాగ చైతన్య ఇచ్చే రియాక్షన్ కూడా హైలెట్‌గా నిలిచింది.

ముద్దుపై సమంత రియాక్షన్..
ప్రోమోలో వచ్చే చివరి షాట్‌పై సమంత తన రియాక్షన్‌ను సోషల్ మీడియా వేదికగా బయట పెట్టింది. ‘ఏ పిల్లా మ్యూజికల్ ప్రివ్యూ బాగుంది.. ఆ లాస్ట్ షాట్ మాత్రం నా మైండ్‌లో కొద్ది రోజులు అలానే ఉండిపోతుంది' అంటూ ముద్దు సీన్‌పై స్పందించింది.


Click it and Unblock the Notifications











