నాగచైతన్య- సమంత విడాకులతో బిజినెస్.. వేణుస్వామిని అరెస్ట్ చేయాలి.. టాప్ డైరెక్టర్ ఫైర్
సమంత- నాగచైతన్యల విడాకుల వ్యవహారం అక్కినేని కుటుంబాన్ని, అభిమానులను నేటికీ బాధపెడుతూనే ఉంది. ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని, ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడం సినీ వర్గాలను, ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేసింది. నిత్యం ఎవరో ఒక సెలబ్రెటీ లేదా సోషల్ మీడియాలో సమంత, నాగచైతన్యల విడాకుల ప్రస్తావన వస్తూనే ఉంది. అయితే ఓ వ్యక్తి మాత్రం పదే పదే సమంత- నాగచైతన్యల విడాకుల ప్రస్తావన తీసుకొస్తూనే ఉన్నాడు. ఆయనెవరో కాదు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. దీంతో ఆయనపై టాలీవుడ్ డైరెక్టర్ మండిపడ్డారు.
సెలబ్రెటీ జ్యోతిష్యుడిగా పాపులర్
తెలుగునాట సెలబ్రెటీ జ్యోతిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వేణుస్వామి. నటీనటుల వ్యక్తిగత వివరాలు, వారి ఆరోగ్యం, సక్సెస్ గురించి వేణుస్వామి చెప్పిన జోస్యాలు చాలా వరకు నిజం కావడంతో ఈయన ఇంటి ముందు సెలబ్రెటీలు క్యూ కడుతున్నారు. దీనికి తోడు కామాఖ్య ఆలయంలో ప్రత్యేకంగా తాంత్రిక పూజలు చేయించంలో పేరు తెచ్చుకున్నాడు వేణుస్వామి. ఆయనతో పూజలు చేయించుకున్న పలువురు సెలబ్రెటీలు టాప్ పొజిటిషన్‌కు చేరడంతో కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతున్న వారు వేణుస్వామిని ఆశ్రయిస్తున్నారు. ఇందుకు గాను ఆయనకు భారీ మొత్తంలో సంభావన దక్కుతోందని సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

దెబ్బకొడుతున్న వేణుస్వామి జ్యోస్యాలు
అయితే వేణుస్వామి చెప్పిన చాలా జోస్యాలు రివర్స్ కావడంతో ఆయనపై ట్రోలింగ్ భారీ స్థాయిలో జరిగింది. ఏపీ, తెలంగాణ ఎన్నికలు, ఇటీవల భారత్ - పాక్ యుద్ధంపై ఆయన ప్రిడిక్షన్స్ తప్పాయి. ఇక తమను డబ్బుల కోసం వేధిస్తున్నారంటూ వేణుస్వామి, వీణ శ్రీవాణి దంపతులు జర్నలిస్ట్ టీవీ 5 మూర్తి దంపతులపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో వీరిద్దరి మధ్యా భారీగా వార్ జరగ్గా.. జాతకాల పేరుతో సెలబ్రెటీలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ టీవీ 5 మూర్తి ఎదురుదాడికి దిగారు. ఇతర వ్యక్తుల నుంచి నిఘా సమాచారాన్ని అందుకుని సినీ, రాజకీయ ప్రముఖులపై జ్యోతిష్యం చెబుతున్నారని ఆరోపించారు. సమంత- నాగచైతన్యల విషయం కూడా ఇలాగే సేకరించారని టీవీ 5 మూర్తి సంచలన ఆరోపణలు చేశారు.
చైతూ- శోభితల జీవితంపై వ్యాఖ్యలు
ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళల వైవాహిక జీవితంపై జోస్యం చెప్పడంతో కోర్టు కేసులు, మహిళా కమీషన్ వరకు వేణుస్వామిపై ఫైరయ్యాయి. దీంతో తాను వ్యక్తుల, రాజకీయ జోస్యాలు చెప్పనంటూ సైలెంట్ అయ్యారు వేణుస్వామి. తాజాగా ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వీణ శ్రీవాణి చాలా బాగుంటుందని, కానీ మొగుడిని కంట్రోల్ చేయడం లేదని మండిపడ్డారు. వేణుస్వామి చెప్పిన జోస్యాలు ఫలించకపోవడంతో భర్తని వెనకేసుకుని వస్తోందని దుయ్యబట్టారు.
నాగార్జున యాక్షన్ తీసుకోవాల్సిందే
నువ్వు జ్యోతిష్యం చేసుకో, మోసాలు చేసుకో.. అడగకుండా సెలబ్రెటీల మీద జ్యోతిష్యం ఎందుకు చెబుతున్నావ్. కేసీఆర్‌కి కానీ, కేటీఆర్‌కి కానీ నువ్వు చెప్పిన ఒక్కటైనా జరిగిందా? జగన్‌తో కారులో వెళ్తున్నట్లుగా ఓ షాట్ వేసుకున్నాడని.. తీరా చూస్తే ఆయనకు 11 సీట్లు వచ్చాయి. జరగని వాటి గురించి ప్రశ్నిస్తే.. నాగచైతన్య - సమంత విడాకులు జరిగాయి కదా అని అంటున్నాడు. వేణుస్వామి మీద నాగార్జున యాక్షన్ తీసుకోవాలి. మంత్రి కొండా సురేఖ వీరి కుటుంబం మీద మాట్లాడినందుకు కోర్టుకెళ్లారు కదా.. అలాగే వేణుస్వామి మీద కూడా కోర్టుకెక్కాలి. నాగచైతన్య కొత్తగా పెళ్లి చేసుకున్న శోభితతో కూడా సరిగా ఉండడని వేణు స్వామి చెబుతున్నాడు.. వాళ్ల జాతకం చెప్పమని ఎవరైనా అడిగారా? నిన్ను అంటూ ఫైర్ అయ్యారు గీతాకృష్ణ.


Click it and Unblock the Notifications











