ఒకే ఈవెంట్‌లో సమంత, నాగచైతన్య.. విడాకుల తర్వాత తొలిసారి ఒకే వేదికపై!

తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని వారసుడు నాగచైతన్య, సమంత బంధం, వారి జీవితంలో చోటు చేసుకొన్న విషయాలు కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎవరికి తెలిసిన సమాచారం, విషయాలు వారు తమకు తోచిన విధంగా రాయడం కనిపిస్తూనే ఉంటుంది. అయితే విడాకుల తర్వాత సమంత, నాగచైతన్య ఇద్దరు ఒకే కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అయితే వారిద్దరు కలిశారా? కలిస్తే వారిద్దరి ఫీలింగ్స్ ఏమిటనే విషయంలోకి వెళితే..

ప్రేమించి పెళ్లి చేసుకొన్న సమంత, నాగచైతన్య సుమారుగా రెండేళ్ల క్రితం విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు. చివరకు 2022 అక్టోబర్ 2వ తేదీన తాము సామరస్యంగా విడిపోతున్నామని బహిరంగంగా సోషల్ మీడియాలో ప్రకటన చేయడంతో అభిమానుల, సినీ వర్గాలు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆ తర్వాత వారి డైవోర్స్‌కు కారణాలు ఇవే అంటూ రకరకాలుగా విశ్లేషించారు.

Samantha Ruth Prabhu and Naga chaitanya Sizzles on Amazon Prime Video Mega Event In Mumbai

అయితే దాంపత్య జీవితం విఫలమైన తర్వాత వారిద్దరూ కలిసి దాఖలాలు కనిపించలేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. నాగచైతన్య తన సినిమాలతో బిజీగా ఉంటే.. సమంత అనారోగ్యంతో సతమతమవుతూ జీవితాన్ని ముందుకు సాగదీస్తున్నారు. ఇద్దరు ప్రొఫెషనల్‌గా బిజీగానే ఉన్నారు.

ఇక నాగచైతన్య సినిమాలతోనే కాకుండా ఓటీటీలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఆయన నటించిన దూత వెబ్ సిరీస్ సినీ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. అయితే దూత సిరీస్‌కు సీక్వెల్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పనిలో బిజీగా ఉన్న నాగచైతన్య ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న అమెజాన్ కాంక్లేవ్‌కు హాజరై అందర్నీ ఆకట్టుకొన్నారు.

Samantha Ruth Prabhu and Naga chaitanya Sizzles on Amazon Prime Video Mega Event In Mumbai

ఇక సమంత కూడా ప్రస్తుతం హాలీవుడ్ సిరీస్ ఆధారంగా తెరకెక్కిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్ ఎప్పుడో అమెజాన్‌లో స్ట్రీమింగ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల స్ట్రీమింగ్ వాయిదా పడింది. అయితే ముంబైలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న అమెజాన్ సదస్సుకు సమంత కూడా హాజరై తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్ చేపట్టారు.

ఇలా ఇద్దరు కూడా ముంబైలోనే ఉండి.. ఒకే సదస్సుకు హాజరు కావడంతో అభిమానులు వారిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తారా? అని ఆశపడ్డారు. కానీ ఆ అవకాశం వారికి దక్కలేదు. నాగచైతన్య ఓ సారి.. సమంత మరోసారి విడివిడిగా వేదికపైన కనిపించారు. వారిద్దరూ కూడా కలువకుండా నిర్వాహకులు వారి ఎంట్రీని పక్కాగా ప్లాన్ చేసినట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X