సమంతకు గట్టి ఎదురుదెబ్బ .. లాస్ట్ మినిట్‌లో తారుమారైన జాతకం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్దినెలలుగా బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టి ముంబైని తన కార్యస్థానంగా మార్చేసుకున్నారు. పోనీ హిందీ సినిమాలలో నటిస్తుందా అంటే అదీ లేదు. ఓటీటీ మార్కెట్ ప్రభావం రోజురోజుకు పెరుగుతుండటంతో అటు ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. వరుసపెట్టి వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. గతేడాది సిటాడెల్‌ వెబ్ సిరీస్‌తో సమంత పలకరించింది.

సిటాడెల్ హనీ బన్నీ అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ వైడ్‌గా అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా సిటాడెల్‌ హనీ బన్నీ అరుదైన రికార్డు సాధించింది. దాదాపు 150 దేశాల్లో టాప్ 10లో సిటాడెల్ స్ట్రీమింగ్ అయి సమంతకు వరల్డ్ క్లాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో సమంత, వరుణ్ ధావన్‌లు నటించగా.. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. తర్వాత సిటాడెల్ సక్సెస్ మీట్ నవంబర్ 28న ముంబైలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన పార్టీలో సమంత రెచ్చిపోయారు. వరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ బేబీ జాన్‌లోని నైన్ మటక్కా సాంగ్‌కు అతనితో కలిసి స్టెప్స్ వేయడంతో బీటౌన్ వర్గాలు షాక్ అయ్యాయి.

samantha ruth prabhu and varun Dhawan s Citadel Honey Bunny fail to win at Critics Choice Awards 2025

తన మాజీ భర్త అక్కినేని నాగచైతన్య మరో తోడు వెతుక్కుని హీరోయిన్ శోభితను రెండో పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. చైతన్య రెండో పెళ్లి విషయం బయటకు రావడంతో సామ్ ఎలా స్పందిస్తారోనని అంతా అనుకున్నారు. కాకపోతే ఇన్‌డైరెక్ట్‌గా నాగచైతన్యపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నామధ్య వరుణ్ ధావన్‌తో కలిసి చేసిన చిట్ చాట్‌లో నాగచైతన్య పేరెత్తకుండా కామెంట్స్ చేశారు సమంత. అటు సిటాడెల్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సామ్ లవ్‌లో ఉన్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇది ఆ తర్వాత పుకారుగానే మిగిలిపోయింది.

సమంత వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఎన్నో సంచలనాలకు వేదికైన సిటాడెల్ : హనీ బన్నీ వెబ్ సిరీస్ ఆమెకు షాకిచ్చింది. ప్రపంచ సినీ రంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల వేడుక ఇటీవల అట్టహాసంగా జరిగింది. శాంటా మోనికాలోని బార్కర్ హ్యాంగర్‌ ఇందుకు వేదికైంది. ప్రపంచ నలుమూలల నుంచి వివిధ భాషలకు చెందిన పలు సినిమాలు , పలు కేటగిరీల్లో పోటీపడ్డాయి. సిటాడెల్ కూడా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ వెబ్ సిరీస్ జాబితాలో నామినేట్ అయ్యింది.

ఈ సినిమా ఖచ్చితంగా అవార్డు సొంతం చేసుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆశ్చర్యకరంగా సిటాడెల్‌ను పక్కకునెట్టి కొరియన్ వెబ్ సిరీస్ స్క్వీడ్ గేమ్ 2 .. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ వెబ్ సిరీస్ అవార్డును దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సస్పెన్స్, థ్రిల్లర్ సిరీస్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. మరోవైపు సిటాడెల్‌కు అవార్డు రాకపోవడంతో చిత్ర యూనిట్ నిరాశలో కూరుకుపోయింది. దీనితో పాటు మనదేశం నుంచి క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుకు నామినేట్ అయిన మరో చిత్రం ఆల్ వి ఇమేజిన్ యూజ్ లైట్. ఇది కూడా బెస్ట్ ఫారిన్ ఫిచర్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయి అవార్డ్ అందుకోలేకపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X