నాగచైతన్యకు సమంత రాఖీ.. బ్రేకప్ తర్వాత..!
అక్కినేని నాగచైతన్య - సమంతలు విడిపోయి ఏళ్లు గడుస్తున్నాయి. కానీ వీరిద్దరి వ్యవహారం ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్కే. సమంతతో విడాకుల తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళను రెండో పెళ్లి చేసుకున్నారు చైతూ. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ టైంను ఎంజాయ్ చేస్తుండగా.. సమంత - నాగచైతన్యలకు సంబంధించిన వ్యవహారాలు ఒక్కొక్కటికీ బయటికి వస్తున్నాయి.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏమాయ చేశావో సినిమా షూటింగ్ సమయంలో సమంతతో నాగచైతన్య ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లు డేటింగ్ చేసిన ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు. కొన్నాళ్లు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసిన ఈ జంట అనూహ్యంగా విడిపోయింది. నాగచైతన్య - సమంతల విడాకుల ఎపిసోడ్‌తో అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఎంతో మనోవేదనకు గురయ్యారు. న్యాయస్థానం వీరిద్దరికి విడాకులు మంజూరు చేయడంతో చైతూ, సమంతలు ఎవరి దారులు వారు చూసుకున్నారు. విడాకులు తీసుకునేంతగా ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఏ కారణాలు ఈ జంటను విడదీశాయి? అనేది మాత్రం తెలియరాలేదు.

గతేడాది నాగచైతన్య - సమంతలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు. శోభితతో చైతన్య ఎంగేజ్‌మెంట్, ప్రేమలతో ఒక్కసారిగా సమంత హైలైట్ అయ్యారు. సమంత , అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సినీ పరిశ్రమ మొత్తం ఆమెకు అండగా నిలిచి, కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. నాగార్జున అయితే ఏకంగా కోర్టులో పరువు నష్టం దావా వేయడంతో పాటు పలుమార్లు కోర్టు విచారణకు కూడా హాజరయ్యారు.
చైతూకు తన జరిగిన ఇష్యూస్‌కు సంబంధించి సమంత ఇంత వరకు ఓపెన్ అయ్యింది లేదు. చాలా మంది ఆమె నుంచి ఏదో ఒకటి లాగాలని ట్రై చేశారు కానీ సమంత చాలా మొండిఘటం .. ఎక్కడో కంట్రోల్ తప్పకుండా వ్యవహరించారు. అయితే కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాత్రం నాగచైతన్య గురించి ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారు. సిటాడెల్ హనీ బన్నీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో వరుణ్ ధావన్‌తో కలిసి సరదా చిట్‌చాట్ నిర్వహించారు సామ్. రాపిడ్ ఫైర్‌లో భాగంగా అవసరం లేకున్నా పెద్ద మొత్తంలో దేని కోసం ఖర్చు పెట్టారు అని ధావన్ ప్రశ్నించారు. దానికి నా ఎక్స్‌కి ఇచ్చిన ఖరీదైన కానుకలు అని ఆన్సర్ ఇచ్చారు సామ్. ఇది నాగచైతన్యను ఉద్దేశించే సమంత అన్నారంటూ అప్పట్లో సోషల్ మీడియా హీటెత్తింది.

అయితే శోభితతో పెళ్లి తర్వాత సమంత గురించి నాగచైతన్య చేసిన వ్యాఖ్యల తాలుకా పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరం ప్రేమలో పడ్డామని, కానీ తమ బంధం గురించి తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పించడంలో తాను ఆలస్యం చేశానని నాగచైతన్య అన్నారు. కానీ ఓ రోజున సామ్, నేను మాట్లాడుకుంటుండగా లవ్ మేటర్‌ను మీ తల్లిదండ్రులకు చెప్పకుంటే నీకు రాఖీ కట్టేస్తానని సమంత బెదిరించిందని, ఆ మాటలకు తాను షాక్ అయ్యానని చైతూ తెలిపారు.
ఆ వెంటనే మా ఇద్దరి ప్రేమ గురించి అమ్మానాన్నలకు చెప్పి వారిని ఒప్పించానని గుర్తుచేసుకున్నాడు. సమంత - నాగచైతన్య మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ , వారిద్దరి ప్రేమ , పెళ్లి, వైహిహిక జీవితంలో ఏం జరిగిందనేది వారే బయటపెట్టుకుంటున్నారు. త్వరలోనే వీరి బ్రేకప్‌కి అసలు రీజన్ కూడా వారే బయట పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











