రెచ్చిపోయిన సమంత .. పబ్లిక్‌లో ఆ హీరోతో క్లోజ్‌గా , షాకింగ్‌గా వీడియో
అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహం త్వరలో జరగనున్న నేపథ్యంలో సినీనటి సమంత వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె ఏం చేసినా , సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా చాలు అది కాస్తా సెన్షేషనల్‌గా నిలుస్తోంది. నాగచైతన్య మాదిరిగానే సమంత కూడా ఎవరితోనైనా ప్రేమలో పడిందా? సైలెంట్‌గా షాకిస్తుందా? అంటూ గత కొద్దినెలలుగా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. తాజాగా సామ్‌కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే.
నాగచైతన్య మరో తోడు వెతుక్కుని జీవితంలో స్థిరపడుతుండగా.. మరి సమంత పరిస్ధితి ఏంటని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. చైతన్య రెండో పెళ్లి విషయం బయటకు రావడంతో సామ్ ఎలా స్పందిస్తారోనని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఈ ఇష్యూని చాలా లైట్ తీసుకున్నారు. కాకపోతే ఇన్‌డైరెక్ట్‌గా నాగచైతన్యపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నామధ్య వరుణ్ ధావన్‌తో కలిసి చేసిన చిట్ చాట్‌లో నాగచైతన్య పేరెత్తకుండా కామెంట్స్ చేశారు సమంత.

నీ లైఫ్‌లో అవసరం లేకపోయినా ఎక్కువ మొత్తం ఎందుకు, ఎప్పుడు ఖర్చు చేశావు అని వరుణ్ అడుగుతాడు. దీనికి సామ్ సమాధానం ఇస్తూ నా ఎక్స్ కోసం ఎన్నో ఖరీదైన బహుమతులు కొనుగోలు చేశానని చెప్పింది. వాటి ధర గురించి వరుణ్ ధావన్ అడగ్గా.. దీనిని కట్ చేసి మరో టాపిక్‌లోకి వెళ్దామా అంటూ సమంత అక్కడితో చెక్ పెట్టారు.
ఇదిలాఉండగా.. సిటాడెల్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సామ్ లవ్‌లో ఉన్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇది ఆ తర్వాత పుకారుగానే మిగిలిపోయింది. కొద్దిరోజులుగా సమంత పర్సనల్ లైఫ్‌కు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సామ్ బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్, బోనీ కపూర్ కుమారుడు హీరో అర్జున్ కపూర్‌తో సమంత రిలేషన్‌లో ఉన్నారంటూ గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇటీవల సమంత షేర్ చేసిన కవితకు అర్జున్ రిప్లయ్ ఇవ్వడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
కాగా.. సిటాడెల్ హనీ బన్నీ అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ వైడ్‌గా అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా సిటాడెల్ హనీ బన్నీ అరుదైన రికార్డు సాధించింది. దాదాపు 150 దేశాల్లో టాప్ 10లో సిటాడెల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సమంత, వరుణ్ ధావన్‌లు నటించగా.. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇందులో నటనకు గాను సమంతపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
సిటాడెల్ సక్సెస్ మీట్ నవంబర్ 28న ముంబైలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన పార్టీలో సమంత రెచ్చిపోయారు. వరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ బేబీ జాన్‌లోని నైన్ మటక్కా సాంగ్‌కు అతనితో కలిసి స్టెప్స్ వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











