Samantha Ruth Prabhu: ఈ సక్సెస్ కు సాక్ష్యం ఇదే.. యశోద టీమ్ పై సమంత ఎమోషనల్ పోస్ట్!

బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి లేడీ ఓరియంటెడ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. హరి హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ యశోద సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక మొదటి వారంలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుని డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా మంచి సంతోషాన్ని ఇచ్చింది.

చూస్తూ ఉంటే ఈ సినిమా మరికొన్ని రోజులు కూడా మరింత వసూళ్ళను అందుకొని సమంత కెరీర్లో మరో రికార్డును క్రియేట్ చేసేలా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇక యశోద సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకోవడంతో చిత్ర సభ్యులు అందరూ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. ఇక సమంత అనారోగ్య కారణాల వలన సినిమా ప్రమోషన్స్ లో పెద్దగా పాల్గొనలేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.

Samantha ruth prabhu emotional note on yashoda movie success celebration

ఇక ఈ సినిమా సక్సెస్ అయినందుకు ఆమె సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. యశోద పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ గొప్ప బహుమతి లాంటిది అని అలాగే ఈ సమయంలో తనకు ఎంతో మద్దతుని ఇచ్చింది అని చెప్పింది. అంతేకాకుండా ఈ ఆనందంతో నేను ఎంతగానో పొంగిపోయాను అని థియేటర్లో వేడుకలు చూస్తూ ఉంటే యశోద సక్సెస్ కు ఇది ఒక సాక్ష్యం అని అంతేకాకుండా చిత్ర యూనిట్ సభ్యులు పడిన కష్టానికి ఫలితం దొరికింది అని ఆమె తెలియజేసింది.

ఇక యశోద మేకింగ్ లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా థాంక్స్ చెబుతున్నాను అని సమంత తెలియజేసింది. ఇక ఆయన నన్ను ఈ ప్రాజెక్టులో నమ్మినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను అని అలాగే దర్శకుడు హరి హరీష్ లతో కలిసి పని చేయడం కూడా ఆనందాన్ని ఇచ్చింది అని వారికి కూడా సమంత కృతజ్ఞతలు తెలిపింది. ఇక తన తోటి నటీనటులు కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించారు అని ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ గారు అన్ని ముకుందన్ అలాగే మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా ఈ సినిమాలో నటించిన విధానం అద్భుతం అని అన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా థాంక్స్ చెబుతున్నట్లుగా సమంత వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X