సమంత పెళ్లిపై రాజ్ నిడిమోరు మాజీ భార్య షాకింగ్ కామెంట్స్.. నిద్రలేని రాత్రులు అంటూ
స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు రెండో పెళ్లి నిరాడంబరంగా మీడియాకు దూరంగా జరిగిపోయింది. గత కొద్దికాలంగా మీడియాలో వస్తున్న డేటింగ్ రూమర్లను నిజం చేస్తూ ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును డిసెంబర్ 1, 2025 తేదీన కోయంబత్తూరుకు సమీపంలోని ఇషా యోగా సెంటర్‌లో వివాహం చేసుకోవడం తెలిసిందే. ఈ వివాహంపై రాజ్ నిడిమోరు మాజీ భార్య సుదీర్ఘమైన పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె వెల్లడించిన ఆవేదనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లికి ముందే నర్బగర్భంగా ఓ పోస్టు పెట్టింది. కోరికలతో రగలిపోయే వారు కొన్ని తెగింపులకు పాల్పడుతారు అంటూ కామెంట్ చేసింది. ఆ పోస్టు ద్వారా రాజ్ నిడిమోరు మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఆమె ఇచ్చిన లీక్‌తో మీడియాలో సమంత పెళ్లి వార్త హైలెట్ అయింది. అయితే తమ పెళ్లి కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా సమంత గానీ, రాజ్ గానీ ఎలాంటి కామెంట్స్ చేయకుండా తమ పని తాము చేసుకొంటూ పోయారు.

సమంతతో రాజ్ పెళ్లి తర్వాత ఆయన మాజీ భార్య శ్యామల డే ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. నాపై చూపించిన దయకు, నాకు విషెస్ అందించిన వారికి, నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పినందుకు థాంక్యూ అని తన మేసేజ్‌లో తెలిపింది.
గత కొద్ది రోజులుగా నేను నిద్రలేని రాత్రులు గడిపాను. నా సన్నిహితులతో రకరకాల చర్చలు, వాగ్వాదాలు జరిగాయి. కానీ నాకు నేను సర్ది చెప్పుకొని నాకు మంచి రోజులు రాబోతున్నాయని అనుకొన్నాను.నాలో ఉన్న ఒత్తిడిని దూరం చేసుకోవడానికి మెడిటేషన్‌ను సాధన చేశాను అని ఆమె అన్నారు.
నేను ఈ వ్యవహారంపై స్పందించడానికి నాకు టీమ్ లేదు. పీఆర్ స్టాఫ్ లేదు. నా పేజ్‌ను మేనేజ్ చేయడానికి ఎవరూ లేరు. అందుకే కాస్త ఆలస్యమైంది. నేను స్వయంగా ఈ పోస్టును రాస్తున్నాను. నా ప్రమేయం లేకుండా ఏదీ జరగకూడదని భావించాను. అందుకే నేను నా ఫీలింగ్స్ తెలియజేస్తున్నాను అని రాజ్ నిడిమోరు మాజీ భార్య అన్నారు.
సమంత విషయానికి వస్తే.. నాగచైతన్యతో వివాహం తర్వాత ఆమె రాజ్ నిడిమోరు దర్శకత్వం వహించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో నటించింది. ఆ సమయంలో రాజ్‌తో పరిచయం జరిగింది. ఆ కాలంలోనే చైతూతో విభేదాలు నెలకొన్నాయి. ఆ తర్వాత 2022 సంవత్సరంలో సమంత విడాకులు తీసుకొన్నది. కొద్ది రోజులుగా రాజ్‌తో డేటింగ్ చేసిన అనంతరం ఆమె రెండో వివాహం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











