బస్సులో నానితో సమంత.. ట్రెండింగ్‌గా వీడియో!

ఇండియన్ సినిమా రంగంలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హీరో, హీరోయిన్లు కలిస్తే అభిమానులకు పండుగలా మారిపోతుంది. అలాంటి సంఘటనే ముంబైలో జరిగింది. నేచురల్ స్టార్ నాని, సమంత రుత్ ప్రభు ఇద్దరు కలుసుకొని ముచ్చటించుకొన్న వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో వారిద్దరూ మాట్లాడుకొంటున్న వీడియో ట్రెండ్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

నానీ, సమంత ఇద్దరు ఈగ చిత్రంలో కలిసి నటించారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వారిద్దరి నటనకు, కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అప్పటి నుంచి నాని, సామ్ ఇద్దరు క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. సమయం చిక్కితే హ్యాపీగా తమ ప్రొఫెషనల్ విషయాలను పంచుకొంటారు.

Samantha Ruth Prabhu met Nani in Mumbai Airport Actor chat in Video goes Trending

ప్రస్తుతం తాను నటించిన సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో నాని బిజీగా ఉన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో నాని భారీగా ప్రచారం చేస్తున్నారు. తన సినిమాతో పాన్ ఇండియా వైడ్‌గా అభిమానులను ఆకట్టుకొనే పనిలో ఉన్నారు. ఆ క్రమంలో ఆయన బాలీవుడ్‌లో ప్రమోషన్స్ చేసేందుకు ముంబైకి చేరుకొన్నారు.

ఇక సమంత కూడా ముంబైలో పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌ రిలీజ్ ఉండటంతో బిజీగా ప్రమోషన్స్‌లో ఉన్నారు. ఆమె ముంబైకి చేరుకొన్న సమయంలో నాని కూడా ఎయిర్‌పోర్టులో కలువడంతో వారిద్దరూ ఒకే బస్సులో ప్రయాణించారు. వారిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకొంటున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

అయితే సమంతతో నాని మాట్లాడుతూ.. నేను నటించిన సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29వ రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. ముంబైలో ప్రమోషన్స్ కోసం వచ్చాం అని చెప్పగానే.. అవునా? అయితే నేను ఇప్పుడే ట్రైలర్ చూస్తాను అంటే.. ఇప్పుడు వద్దు.. ఇంటికి వెళ్లిన తర్వాత చూడండి అంటూ సరదాగా ముచ్చటించడం కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X